టాలీవుడ్ లో తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క. వరుసగా సినిమాలు చేయడం అగ్ర హీరోలతో సినిమాలు చేయడం తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. కెరీర్ మొదట్లో కాస్త ఇబ్బంది పడినా ఆ తర్వాత మాత్రం ఆమె మంచి సినిమాలు చేస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టాయి అనేది వాస్తవం. ప్రస్తుతం కెరీర్ లో ఆమె పీక్ స్టేజి లో ఉంది. అయితే వయసు మీద పడటం తో ఆమె తో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. 

 

ఇదిలా ఉంటే ఆమె ను కొందరు వేధించారు టాలీవుడ్ లో అని అంటూ ఉంటారు. ఒక సీనియర్ హీరో తో పెళ్లి అయిన హీరోతో ఆమెకు ప్రేమ వ్యవహారం ఉన్న నేపధ్యంలో కొందరు హీరోలు ఆమెను దూరం పెట్టారని ఆ హీరోకి ఆమె దగ్గర కావడం అసలు కొంత మంది ఏ విధంగా కూడా తట్టుకోలేదు అని ఆమెను బాగా వేధించారు అని ప్రచారం కూడా జరిగింది. ఆమె ఒకానొక సమయంలో తెలుగు సినిమాలకు పూర్తిగా దూరం కావాలని కూడా అనుకుందని కాని ఆ తర్వాత అదే హీరో ఆమెకు దూరం జరిగి ఇబ్బంది పెట్టను అని చెప్పాడం తో ఆమె తెలుగులో కొనసాగింది అంటున్నారు. 

 

టాలీవుడ్ లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చిన సమయంలో ఆ సీనియర్ హీరో తో ఆమె ప్రేమలో పడింది అని అది కొందరు దర్శకులకు కూడా అసలు నచ్చలేదు అని ఆమెను పిలిచి క్లాసులు కూడా పీకారని అందుకే బాగా ఇబ్బంది పడి తెలుగులో సినిమాలు వదిలేసి తమిళంలో చేసుకోవాలని చూసింది అని అంటూ ఉంటారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: