వరుణ్ తేజ్.. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో చెప్పుకోతగ్గ హీరోలలో ముందు ఉండే పేరు. దీనికి వరుణ్ సెలెక్ట్ చేసుకొనే సినిమాలు, అందులో తన నటన. అయితే తాజాగా ఆయన బాబాయి పవన్ కళ్యాణ్ నటించిన ఆ సినిమాను ఎన్ని సార్లు చూసానే లెక్కేలేదు అంటూ అభిమానులతో చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్.. లాక్‌డౌన్  కారణంగా ఇంట్లో ఉంటూ అభిమానులతో సోషల్ మీడియా వేదికగా చిట్‌ చాట్ చేసాడు. ఈ సందర్భంగా జరిగిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు వరుణ్ తేజ్.

 


ఈ చిట్‌ చాట్ సందర్భంగా ఓ అభిమాని మీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి అన్న ప్రశ్నకి యాక్షన్ సినిమాలు అంటూ సంధానం ఇచ్చాడు. అంతేకాకుండా తమ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఒక్క మాటలో చెప్పుకొచ్చాడు వరుణ్. పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తారని అలాగే నాన్న నాగబాబు నా బలం. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజాయితీకి మారు పేరు అంటూ ఆయన పేర్కొన్నాడు. అలాగే ఈ జెనరేషన్ హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ మంచి హార్ట్ వర్కర్స్ అంటూ వారి దగ్గరినుంచి సినిమా కోసం ఎంతలా కష్టపడాలో నేర్చుకున్న అన్నారు. అలాగే బాలీవుడ్‌ లో తనకు ఫేవరేట్ హీరో షారుఖ్ ఖాన్ అని తెలిపారు. ఇంకా కామిక్ హీరోల్లో బాట్ మేన్ తన ఆల్ టైమ్ ఫేవరేట్ అని తెలిపారు.  

 

 

ప్రస్తుతం క్వారంటైన్‌ లో కేవలం స్నూకర్ ఆడుతూ టైమ్‌ పాస్ చేస్తున్నట్టు తెలిపాడు. అలాగే ఇంకోవైపు ఆన్‌ లైన్‌ లో గిటార్ నేర్చుకుంటున్నట్టు ఆయన చెప్పారు. నా తరువాతి సినిమా బాక్సింగ్ నేపథ్యంలో చేస్తున్నాను అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పుకొచ్చాడు. దీనికోసం ఒక కోచ్‌ ను నాతో పాటు ఉంటున్నాడు. ఆయనతో ప్రతిరోజు బాక్సింగ్ క్లాసులు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపాడు. అలాగే త్వరలో ఎఫ్ 3 సినిమాకు సంబంధించిన అప్‌ డేట్స్ ఇస్తానన్నాడు తేజ్. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఏ సినిమా ఫేవరేట్ అని అడగగా తమ్ముడు సినిమా అని తెలిపాడు. నిజానికి ఆ సినిమాను నేను ఎన్ని సార్లు చూసానో లెక్కలేదంటూ అని తెలిపాడు వరుణ్ తేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: