సమీరా రెడ్డి... చేసినవి తక్కువ సినిమాలే అయినా సరే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్. ఆమె ఎక్కువ కాలం తెలుగులో చేయకపోయినా సరే ఆమె గురించి వచ్చిన వార్తలు మాత్రం చాలానే ఉన్నాయి. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ తో ప్రేమ వ్యవహారం ఆమెకు ఉందని వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఒకప్పుడు పెద్ద ఎత్తున జరిగింది. వారి మధ్య ఏదో ఉందీ అంటూ అప్పుడు అభిమానులు కూడా చర్చించుకున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ తో ఆమె చేసిన రెండు సినిమాల్లో ఆమె వేసిన దుస్తుల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 

 

ఎన్టీఆర్ ఆమెను పెద్దగా డ్రెస్ లు వేయించాడు. ఎక్కువగా అందులోనే ఉండాలని ఆమెకు చెప్పడం తో ఆమె స్కిన్ షో చేయడానికి ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గాని ఆమె తెలుగు సినిమాలకు దూరం అయింది. దీనిపై ఇప్పటికి ఎన్నో చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఏదోక సందర్భంలో ఆమెను చూసిన ప్రతీసారి ఆమె ఎందుకు తెలుగు సినిమాలకు దూరమైంది అని అప్పటి అభిమానులు అడుగుతూనే ఉంటారు. దానికి కారణం ఎన్టీఆర్... ఆమెకు ఎన్టీఆర్ తో ప్రేమ వ్యవహారం సమయంలో.... 

 

ఒక కుటుంబం నుంచి బాగా ఒత్తిడి వచ్చిందని అది తట్టుకోలేక ఆమె సినిమాలకు దూరమైంది అని అంటున్నారు. ఆమెకు సినిమాల మీద ఆసక్తి ఉన్నా సరే మీడియా కథనాల్లో ఆమె కు డాన్స్ రాదు అని కొందరు ప్రచారం చేసారని ఆ తర్వాత మంచి డాన్స్ చేసినా సరే దర్శకులకు ఆమెకు మధ్య విభేదాలు వచ్చాయని... ఆమె చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అని అందుకే ఆమెను పక్కన పెట్టారు అని ప్రచారం జరిగింది. అందుకే ఆమె తెలుగుకి దూరమైనట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: