కోవిడ్ ౧౯ విజృంభిస్తున్న సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా నుండి రక్షించుకోవడానికి సామాజిక దూరం పాటించడమే శ్రేయస్కరమన్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనా వ్యాప్తి నివారణకి కృషి చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు క్యాన్సిల్ అవడంతో ఇళ్ళలోనే ఉండి కాలాన్ని వెళ్లదీస్తున్నారు. అయితే ఈ లాక్డౌన్ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాడుకుంటున్నారు.

 

 

కొందరు అప్పటి వరకు చూడని సినిమాలని, వెబ్ సిరీస్ లని చూస్తూ కూర్చుంటే, మరికొందరు తమలో ఉన్న మరో కళకి మెరుగులు దిద్దుకుంటున్నారు. ఒకప్పుడు హీరోగా ఉండి, ఇప్పుడు సక్సెస్ ఫుల్ విలన్ గా వరుస అవకాశాలు తెచ్చుకుంటున్న జగపతిబాబు లాక్డౌన్ సమయంలో తన సినిమాలని చూస్తున్నాడట. ఈ సమయంలో ఎంజాయ్ చేయడం కంటే, తనలో ఉన్న తప్పులని తెలుసుకునేందుకే సినిమాలని చూస్తున్నాడట.

 

 


 తాను నటించిన సినిమాల్లో ఎక్కడెక్కడ తన నటన బాలేదో చూసుకుంటూ, ఇంకా ఎంతబాగా చేయవచ్చో తెలుసుకుంటున్నాడట. అలా తనని పరిశీలించుకుంటున్న క్రమంలో అరవింద సమేత సినిమాలో కొన్ని షాట్లలో తన నటన బాగా లేదని చెప్తున్నాడు.ముఖ్యంగా క్లోజప్ షాట్లలో తానింకా బాగా చేయాల్సిందట, కానీ అప్పటి మూడ్ వల్ల ఆ విధంగ వచ్చిందని అంటున్నాడు.

 

 

అయితే ఇలాంటి చిన్న చిన్న వాటిని ప్రేక్షకులు గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ నన్ను నేను తెర మీద చూసుకున్నప్పుడు ఈజీగా తెలిసిపోతుందని చెప్తున్నాడు. అరవింద సమేతలో విలన్ గా చేసిన జగపతి బాబు ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడని ప్రశంసలు వచ్చాయి. రంగస్థలంలో ప్రెసిడెంట్ పాత్రకి ఎంత పేరొచ్చిందో అరవింద లో బసిరెడ్డి పాత్రకి కూడా అంతే పేరొచ్చింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: