టాలీవుడ్ లో సినీ హీరోలను దేవుళ్లుగా ఆరాధిస్తుంటారు వారి అభిమానులు. వారి లైఫ్ లో ఏ సంఘటన అయినా వీరి లైఫ్ లో జరిగినట్లు ఆనందపడుతుంటారు. తమ హీరోల బర్త్ డే వచ్చింది అంటే ఫ్యాన్స్ ఎంత సందడి చేస్తారో అందరికి తెలిసిన విషయమే. తమ అభిమాన హీరోల బర్త్ డే కి పెద్ద పెద్ద కటౌట్లు..బ్యానర్లు.. ప్లెక్సీలు.. కేక్ కట్టింగ్ లు అంటూ బర్త్ డే వేడుకలు జరుపుతూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే హీరోల పుట్టిన రోజులను అభిమానులు, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు నిర్వహించడం కామన్. కానీ ఒక హీరో దగ్గర పనిచేసే అసిస్టెంట్ పుట్టిన రోజును హీరో సెలబ్రేట్ చేయడం చాలా అరుదుగా జరిగే సంఘటన. అలాంటి బర్త్ డే సెలబ్రేషన్ ఇప్పుడు ఇక్కడ జరిగింది. ఆ హీరో మరెవరో కాదు... టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇటీవలే తన కుమారుడు అల్లు అయాన్ బర్త్ డేను.. తర్వాత తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్న అల్లు అర్జున్ లేటెస్టుగా తన దగ్గర పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేసే వ్యక్తి పుట్టిన రోజుని కూడా సెలెబ్రేట్ చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. తన అసిస్టెంట్ శివ బర్త్ డే సందర్భంగా తనయుడు అయాన్ చేతుల మీదుగా తన పర్సనల్ అసిస్టెంట్ కి కేక్ కటింగ్ చేపించాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. 

 

 

బన్నీ తన అసిస్టెంట్ పుట్టిన రోజు కోసం స్వయంగా తన ఇంట్లోనే కేక్ తయారు చేపించి అతని బర్త్ డే సెలెబ్రేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన బన్నీ అభిమానులు చాలా ఖుషీ అవుతున్నారు. ఏదేమైనా తన దగ్గర పని చేసే అసిస్టెంట్ బర్త్ డేకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి స్వయంగా తనే కేక్ కటింగ్ చేపించి అతన్ని సంతోష పరచడం నిజంగా చాలా గొప్ప విషయమని అందరూ బన్నీని అభినందిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్సుకుమార్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కు‌తున్న హ్యాట్రిక్ చిత్రానికి 'పుష్ప‌' అనే టైటిల్‌ని చిత్ర బృందం ఇటీవ‌ల ఖరారు చేసిన విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సుక్కు ప్రతి సినిమాలో హీరోని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తూ వస్తున్నాడు. 'పుష్ప' పోస్టర్ చూస్తే లెక్కల మాస్టర్ సుకుమార్ మరో ప్రయోగానికి తెరలేపాడని ఇట్టే అర్ధమైపోతుంది. రాయలసీమ చిత్తూరు యాస, భాషతో పాటు బన్నీ ఊరమాసు మొరటు కుర్రాడిగా ఇరగదీస్తాడనిపిస్తుంది. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే షూటింగ్ లో పాల్గొననున్నాడు బన్నీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: