మళయాలం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ ను తెలుగులో రీమేక్ చేయనున్నారని తెలిసిందే. రామ్ చరణ్సినిమా హక్కులను దక్కించుకోగా మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించనున్నాడు. అయితే ఈ రీమేక్ కు దర్శకుడు ఎవరనే  విషయంలో ట్విస్ట్ ఇచ్చాడు చిరు. రీమేక్ లను డీల్ చేయడంలో సక్సెస్ అవుతున్న హరీష్ శంకర్ కో లేక వేరే ఎవరైనా స్టార్ డైరెక్ట్ కు అవకాశం ఇస్తాడనుకుంటే అనూహ్యంగా సుజీత్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించి ఆశ్చర్యపరిచాడు. అయితే మెగా ఫ్యాన్స్ తో సహా చాలా మంది  ఈ న్యూస్  అబద్దం అనుకున్నారు కానీ తాజాగా చిరునే క్లారిటీ ఇచ్చాడు. 
 
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని  సుజీత్  ఈసినిమా డైరెక్ట్ చేయనున్నాడని చెప్పాడు. సాహు తో నిరాశపరిచినా కూడా సుజీత్ కు ఛాన్స్ ఇవ్వడానికి   కారణం ఏంటంటే అతని స్టైలిష్ మేకింగ్.. మరి సుజీత్, చిరు నమ్మకాన్ని నిలబెడతాడోలేదో చూడాలి. ఇక లూసిఫర్ ఒరిజినల్ వెర్షన్ లో మలయాళ సూపర్ స్టార్  మోహన్ లాల్ నటించగా స్టార్ హీరో  పృథ్వీరాజ్ డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలైంది కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు. చిరు ప్రస్తుతం ఆచార్య లో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూర్తి చేసి లూసిఫర్ రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.   
 
ఇక ఆచార్య విషయానికి వస్తే బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో  కాజల్ కథానాయికగా నటించనుండగా రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ పడింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్  సంయుక్తంగా నిర్మిస్తున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: