ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే రామ్‌చ‌ర‌ణ్‌కి అమిత‌మైన ప్రేమ అభిమానం ఉంటుంది. బాబాయ్ అంటే ఎవురికి ఇష్ట‌ముండ‌దు అంద‌రికీ ఇష్ట‌మే అనుకుంటున్నారా. అయితే వీరిద్ద‌రూ మాత్రం ప్రేమాభిమానాల్లో అంత‌క‌న్నా ఎక్కువ‌గానే ఉంటార‌ని చెప్పాలి. ఆయ‌న లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రంగ‌స్థ‌లం స‌క్సెస్‌మీట్‌లో ఆయ‌న స్పీచ్ వింటే మ‌న‌కు అర్ధం అవుతుంది.... ఇక్క‌డ‌కు విచ్చేసిన అక్క చెల్లిళ్ళు అంద‌రికీ ప్ర‌తి ఒక్కరికీ నా హృద‌య‌పూర్వ‌క న‌మ‌స్కారాలు ధ‌న్య‌వాదాలన్నారు. రంగ‌స్థ‌లంలో ఉన్న న‌టీన‌టులంద‌రూ ఒక స్క్రీన్ మీద బంధించ‌డం చాలా చిన్న‌దైపోయింది. అంత మంది న‌టీన‌టుల స‌మూహం. అపార‌మైన అనుభ‌వం ఉన్న న‌టీన‌టులు ఉన్నారు. ఈ రంగ‌స్థ‌లం న‌టీన‌టుల‌కు విజ‌యోత్స‌పు ధ్వ‌నులు ఆగ‌కూడ‌ద‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ‌రిన్ని విజ‌యాల‌ను సాధించాలి. ఉత్తేజాల‌ని క‌లిగించే రికార్డుల‌ను క‌లిగిఉండాలంటున్నాను. భార‌తీయ చ‌ల‌న చిత్ర సీమలోనే గ‌ర్వించ‌ద‌గ్గ సినిమాని తీసిన సుకుమార్‌గారికి నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు అన్నారు. అలాంటి సినిమాకి బ‌లంగా అండ‌దండ‌లుగా నిల‌బ‌డిన మైత్రిమూవీస్ వారికి నా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను అన్నారు. 

 

నేను ఎప్పుడూ నా సినిమాల్లో యాక్ట్ చేయ‌డం త‌ప్పించి పూర్తి సినిమా చాలా త‌క్కువ సినిమాలు చూసి ఉంటాను. తొలిప్రేమ సినిమా కోసం ఒక‌సారి సంధ్య థియేట‌ర్‌కి వెళ్ళాను అంతే ఆ సినిమా కూడా ఇంట‌ర్వెల్ త‌ర్వాత వ‌చ్చేశాను నాకు ఇబ్బందిగా అనిపించి అన్నారు. కానీ చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత ఒక‌సినిమాని ప‌బ్లిక్ థియేట‌ర్‌లో చూడాలని కోరిక క‌లిగింది. దానికి ప్ర‌త్యేక కార‌ణం చ‌ర‌ణ్ పెర్ఫార్మెన్స్ గురించి ప్ర‌తి ఒక్క‌రూ మాట్లాడుతుంటే అలాగే దాని మీద ఉన్న రేటింగ్స్ కూడా వ‌ర‌ల్డ్ వైడ్ హాలీవుడ్ మూవీస్  రేంజ్‌లో దానికి రేటింగ్ రాగానే నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. గ‌ర్వంగా కూడా అనిపించింది. ఏముంది ఈ సినిమాలో అని ఉత్సాహంతో కుతూహ‌లం వ‌చ్చింద‌న్నారు. రంగ‌స్థ‌లం సినిమా చాలా మందికి ఇన్‌స్పిరేష‌న్ క‌లిగిస్తుంది. చ‌ర‌ణ్ చాలా పాష్‌గా పెరిగాడు కానీ అంత మాస్ క్యారెక్ట‌ర్ చేయ‌డం అంటే గ్రేట్ అన్నారు.చ‌ర‌ణ్‌కి నేను బాబాయ్‌కంటే కూడా ఒక అన్న లాంటివాడిని. నా చిట్టిబాబు అంటే నాకు చిన్న త‌మ్ముడులాంటివాడు. మా అన్న‌య్య అంటే నాకు తండ్రి, మా వ‌దిన‌మ్మ‌నాకు త‌ల్లిలాంటిది. చ‌ర‌ణ్‌కి ఎప్పుడూ కూడా అస్స‌లు గ‌ర్వం అనేది ఉండ‌వు. ఎన్ని హిట్లు కొట్టినా ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా కూడా త‌న‌ప‌ని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: