రాహుల్ సిప్లిగంజ్ ఈ మాట వినగానే అందరికీ గుర్తు వచ్చేది బిగ్ బాస్ 3 విన్నర్ గా, అంతేకాకుండా మన తెలుగు ఇండస్ట్రీలో మంచి గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ కలిసి ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ ఆల్బమ్ లో ఇద్దరూ రెచ్చిపోయి నటిస్తున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. లిప్లాక్ కూడా చేశారు. ఇక రాహుల్ సిప్లిగంజ్ ఈ పాడే పాటలు యువత అందరికీ ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. తాజాగా నందినితో రొమాన్స్ చేసిన వీడియోని సోషల్ మీడియా వేదికగా చేసుకొని షేర్ చేయడం జరిగింది. ఇక ఈ వీడియోకి ఆశు రెడ్డి చేసిన కామెంట్స్. రాహుల్ రిప్లై లు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

With this pretty lady @nandini.rai #throwbackmemories😍 #enduke #musicvideo #myfavorite

A post shared by rahul Sipligunj (@sipligunjrahul) on


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే .. రాహుల్ ప్లే బ్యాక్ సింగర్ ప్రైవేట్ ఆల్బమ్ లో చాలా మంది ఆదరణ లభించుకున్నాడు. దీనితోపాటు బిగ్ బాస్ 3 విన్నర్ అవ్వడంతో మరింత క్రేజ్ బాగా పెరిగింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పటి నుంచి రాహుల్ చాలా బిజీ అయిపోయాడు. ఒకవైపు తన స్టైల్ లో పాటలు పాడుతూ మరోవైపు ఆల్బమ్స్ లో నటిస్తూ చాలా బిజీ అయ్యాడు. తాజాగా ఒక సినిమాలో కూడా ముఖ్య పాత్ర వహిస్తున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందబోతున్న రంగ మార్తాండ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు రాహుల్. 

 


ఇక రాహుల్ షేర్ చేసిన వీడియోకి ఆషురెడ్డి చేసిన కామెంట్స్ నెటిజన్లలో చాలా ఆసక్తి రేపాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఆషురెడ్డి రాహుల్ ని ఆటపట్టించిన విధానం అందరికి తెలిసిందే కదా. అదే రీతిలో ఒక బోల్డ్ కామెంట్ కూడా చేసింది.. లిప్ లాక్ సీన్లు ఉద్దేశిస్తూ ఆశు వావ్ ఇది నేను చూడ లేదే అంటూ సెటైర్ కామెంట్ వేయడం జరిగింది. ఇక ఈ కామెంట్ కి స్పందిస్తూ రాహుల్ అబ్బో ఇక నేను చచ్చిపోతా అంటూ కామెంట్ చేయడం జరిగింది. మళ్లీ తిరిగి కామెంట్ చేసిన ఆషురెడ్డి మీ వీడియోస్ లో మినిమం ఉంటాయి కదా అంటూ నవ్వుతూ కామెంట్ చేసింది. ప్రస్తుతం వీరి సంభాషణ వీడియో నెట్టింట చాలా వైరల్ గా మారింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: