కరోనా పుణ్యమా అని ఇప్పుడు సినీ పరిశ్రమ కంటి మీద కునుకు లేకుండా బ్రతుకుతుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. సినీ పరిశ్రమలో చాలా మంది ఇప్పుడు సినిమాల షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు రోజు సందడి గా ఉండే ఫిలిం నగర్ లో ఇప్పుడు ఏ వాహనం కనిపించడం లేదు. హైదరాబాద్ లో కరోనా ఎక్కువగా ఉన్న నేపధ్యంలో షూటింగ్ చెయ్యాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. టాలీవుడ్ లో అగ్ర దర్శకులు నిర్మాతలు హీరోలు కూడా ఇప్పుడు భయపడుతున్నారు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. టాలీవుడ్ అగ్ర దర్శకులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పెద్ద పెద్ద సినిమాలు సమయం ఎక్కువగా పట్టే సినిమాలు వద్దు అని ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పెద్ద సినిమాల షూటింగ్ అంటే చాలా రోజులు పడుతుంది. ఏడాది రెండేళ్ళు పట్టే సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమాలను షూట్ చేస్తే మరింత నష్టపోయే అవకాశం ఉంటుందని కరోనా ప్రభావం తగ్గే అవకాశాలు ఇప్పట్లో లేవు కాబట్టి అన్ని దేశాలు ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. 

 

అందుకే ఇప్పుడు సినిమాల షూటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు. అందుకే షూటింగ్ లు విదేశాల్లో ఉంటే మాత్రం అవసరం లేదు అనే నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తుంది. సీనియర్ హీరోలు అయినా అగ్ర హీరోలు అయినా సరే వద్దు అని భావిస్తున్నారట. విదేశాల్లో షూటింగ్ అంటే ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అందుకే ఇప్పుడు ఖర్చు పెంచుకునే కార్యక్రమాలు అవసరం లేదని భావిస్తున్నారట. ఇప్పటికే దర్శకులు ఈ విషయాన్ని హీరోలకు కూడా చెప్పినట్టు సమాచారం. అలాంటి సినిమాలు ఏమీ కూడా తాము చేసే ఆలోచనలో లేము అని చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: