ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో సినిమా తీయాల‌ని చాలా మంది ద‌ర్శ‌కుల‌కి ఉంటుంది. అయితే ఆయ‌న‌తో చేయ‌డానికి అవ‌కాశం దొరికిన‌వారు కూడా చాలా అదృష్టంగా భావిస్తారు. ఎంతో మంది ద‌ర్శ‌కులు ఎలాగైనా ఆయ‌న‌తో సినిమా తీయాల‌ని ఇప్ప‌టికి క‌ల‌లు కంటున్నవారు బోలెడు మంది అని చెప్పాలి. ఆయ‌న‌కుండే క్రేజే అంతా ఇంతా కాదని చెప్పాలి. అయితే సాధార‌ణంగా ఆయ‌న ఎవ్వ‌రినీ అంత తొంద‌ర‌గా మెచ్చుకోరు. మ‌రి ఆయ‌న మెచ్చుకున్నారంటే ప‌వ‌న్‌కి ఆ ద‌ర్శ‌కుడిలో న‌చ్చింది ఏమిటంటే... ఇంత‌కీ ఎవ‌రా ద‌ర్శ‌కుడు ఏమా క‌థ అనుకుంటున్నారా... అదేనండి మ‌న లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ అంటే ప‌వ‌న్ కి ఎంతో ఇష్ట‌మ‌ట‌. ఆయ‌న సుకుమార్ గురిచం రంగ‌స్థ‌లం సినిమా స‌క్సెస్‌మీట్‌లో ఆయ‌న గురించి ప‌వ‌న్ మాట్లాడిన మాట‌లు వింటే మ‌న‌కు అర్ధ‌మ‌వుతుంది. ఆయ‌న‌కు సుకుమార్ అంటే ఎంత ఇష్ట‌మో.  ఒక సినిమా అంటే బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల‌ను బ‌ద్ద‌ల‌కొట్ట‌డ‌మే కాదు. ఇలాంటి సినిమాలు రావ‌డం వ‌ల్ల భావిత‌రాల‌కి ఇన్‌స్పిరేష‌న్‌గా నిలుస్తాయి అన్నారు. 

 

అలాగే ఒక విలువ‌ల‌తోటి వాస్త‌విక‌త‌కి అత్యంత ద‌గ్గ‌ర‌గా ఉండే సినిమాలు తీయ‌డం అదీ క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ కొట్ట‌డం అనేది చాలా మందికి ఇది బ‌లం అని చెప్పాలి. రంగ‌స్థ‌లం సినిమా చాలా మందికి ఇన్‌స్పిరేష‌న్ క‌ల‌గ‌చేస్త‌ది అని అన్నారు. అలాంటి ఒక సినిమాని నాకు చాలా సంవ‌త్స‌రాల క్రితం సుకుమార్‌గారు నాకు క‌థ చెప్పారు. ఒక ప‌దేళ్ళ క్రితం ఒకేక్క‌సారి క‌లిశాం. ఆయ‌న పాపం నాకేదో క‌థ చెప్పాల‌నుకున్నారు. కానీ నేను ఏదో మూడ్‌లో ఉన్నాను అన్నారు. ఆయ‌న చెప్పిన క‌థ విన్నా కాని నేను పెద్ద‌గా స్పందించ‌లేదు. మ‌రోసారి క‌లుద్దాం అన్నాను. ఆయ‌న‌తో సినిమా చేసే అవ‌కాశం నాకు ల‌భించ‌లేదు కానీ నాకు ఆయ‌న మొద‌టి సినిమా నుంచి కూడా ఆయ‌నంటే నాకు చాలా ఇష్టమైన ద‌ర్శ‌కుడు అన్నారు. స‌హ‌జ‌త్వానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉండే ద‌ర్శ‌కుడు అన్నారు. అలాగే కాంటెపంర‌రీ యువ‌త‌కి ఏం కావాలో తెలిసిన ద‌ర్శ‌కుడు. గొప్ప ర‌చ‌యిత‌. ఈ వాస్త‌విక‌తకి ద‌గ్గ‌ర‌గా ఉండే ద‌ర్శ‌కుడు. మంచి సినిమాలు చేసే ద‌ర్శ‌కుడు అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: