పవన్ కళ్యాణ్ సినిమాలనుండి రాజకీయాలలోకి వెళ్లి బిజీ అయ్యాడు. గత కొంత కాలంగా రాజకీయాల్లో స్తబ్దంగా ఉన్నాడు పవన్ . అయితే సినీపెద్దల ప్రోద్బలంతో మళ్లీ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో వకీల్ సబ్ సినిమాకు డేట్స్ ఇచ్చాడు. అయితే కొంత మేర సినిమా కంప్లీట్ అయ్యింది. 
ఈ సినిమాలో శృతి హస్సన్ పవన్ కి జోడి గా తీసుకున్న సంగతి తెలిసిందే.ఈమేర శృతి అగ్రిమెంట్ కూడా చేసుకుంది. దానికి తగ్గట్టుగా డేట్స్ కూడా ఇచ్చింది . ఉన్నట్టుండి శృతి హస్సన్ యూ టర్న్ తీసుకుంది .దీనితో సినిమా నిర్మాతలు తలలు పట్టుకుని కూర్చున్నారు.

నిర్మాతలు అధికారికంగా ఈ విషయం తెలియజేయలేదు. ఈ సినిమా క్లైమాక్స్  సమయంలో శృతి హాసన్ క్యారెక్టర్ ఉంటుంది. అదికూడా ఓ 20 నిమిషాల  పాటు ఈ క్యారెక్టర్ ఉంటుంది. శృతి సినిమానుండి తప్పుకోవడానికి చాల కారణాలే వినిపిస్తున్నాయి . అయితే ముఖ్యంగా ఆమెకి మరియు శ్రీరామ్ వేణుతో ఉన్న విభేదాలే కారణమని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ సినిమా సంబంధించి  35 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది 

మరింత సమాచారం తెలుసుకోండి: