టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోల్లో జగపతి బాబు ఒకరు. ఆయన అగ్ర నిర్మాత కొడుకు అయినా సరే తనకు తానుగా సొంతగా ఎదిగే ప్రయత్నం చేసి ఎక్కువగా సినిమాలు చేసారు. టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో అగ్ర హీరో హోదా వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆయన బాగా దగ్గరయ్యారు. మహిళా ప్రేక్షకులు ఆయనకు బాగా దగ్గరయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమా వస్తుంది అంటే చాలు సొంత పనులను పక్కన పెట్టి మరీ సినిమాలను చేసే పరిస్థితి మనం చూసే వాళ్ళం. అయితే హీరో గా ఆయనకు వరుస ఫ్లాప్ లు రావడం తో... 

 

ఇప్పుడు విలన్ గా ఆయన వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. అలాగే తండ్రి గా వ్యాపారవేత్తగా ఆయన మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆయన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది సినిమాలో. ఆయన అందుకే అవకాశాలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు ఆయనకు మంచి డిమాండ్ ఉంది. అందుకే ఆయన కూడా భారీగానే వసూలు చేస్తున్నారని అర్ధమవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఆయన మీద ఇప్పుడు కొందరికి చాలా కోపం ఉంది అనేది కొందరి మాట. దానికి కారణం చాలా పెద్దదే అని అంటున్నారు. 

 

అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే... జగపతి బాబు వచ్చిన తర్వాత కొందరు హీరోలకు గుర్తింపు రావడం లేదని టాక్. కొందరు హీరోలను అసలు అభిమానులు పట్టించుకోవడం లేదు. ఆయన విలన్ అయినా సరే ఆయనకే ఎక్కువగా మార్కులు పడుతున్నాయి. ఆయన చేసిన లెజెండ్ సినిమాలో కూడా ఇదే పరిస్థితి ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. చాలా మంది జగపతి బాబుని చూడటానికే సినిమాకు వెళ్ళిన సందర్భం ఉంది. అందుకే ఇప్పుడు యువ హీరోలు ఆయనను వద్దని అంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: