జూనియర్ ఎన్టీఆర్ కి టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అతని సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ప్రత్యేక దృష్టి పెడుతూ ఉంటారు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా. అటు మాస్ కి ఇటు క్లాస్ కి కూడా అతను బాగా దగ్గరవుతూ వచ్చాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఒక బాలీవుడ్ హీరో ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ అగ్ర హీరో ఒకరు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి, 

 

ఇప్పటికే హైదరాబాద్ కూడా వచ్చి వెళ్ళాడని సమాచారం. హైదరాబాద్ లో తారక్ ని కలిసి తన సినిమాలో ఒక పాట పాడటమే కాకుండా విలన్ గా కూడా నటించాలి అని కోరినట్టు తెలుస్తుంది. దీనికి జూనియర్ సానుకూలంగా స్పందించినా సరే రాజమౌళి మాత్రం అందుకు నో అన్నట్టు తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి అతను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తున్నాడు. ఇప్పుడు సినిమా చేసే సమయం రావడం తో వచ్చి అడిగినట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తాను అని చెప్పాడట. 

 

అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మరి బాలీవుడ్ సినిమా ఎప్పుడు చేస్తాడు అనేది చెప్పలేని పరిస్థితి. మన తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పటి నుంచో జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో అడుగు పెట్టే అవకాశం ఉందని ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు. మరి ఆ సమయం వచ్చిందో లేదో తెలియదు. తారక్ సినిమా చేస్తాను అంటే ఆ హీరో భారీగా డిమాండ్ కూడా చేసాడని సమాచారం. దాదాపు ఆరు కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడానికి రెడీ అయ్యాడు. కేవలం 10 నుంచి 20 నిమిషాల పాత్రకు.

మరింత సమాచారం తెలుసుకోండి: