టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల క్రితం హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్సకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత సినిమాల కెరీర్ కు కొంత విరామం ప్రకటించిన పవన్, ఆపై తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో మునిగిపోయి మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రా తరపున పోటీ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం వకీల్ సాబ్ లో నటిస్తున్న పవన్ కు టాలీవుడ్ లో ఎందరో అభిమానులు ఉన్నారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, వదిన సురేఖల ఆశీర్వాదంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ బాబు, మెల్లగా ఒక్కొక్క సినిమాతో మంచి విజయాలు అందుకుని నేడు పవర్ స్టార్ గా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. 

 

మొదటి నుండి తన పరిధి మేరకు మాత్రమే మాట్లాడుతూ, షూటింగ్ లో అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే పవన్ అంటే ఎందరో దర్శక నిర్మాతలకు ఇష్టం. ఇక తన అన్నయ్య, వదినలు అంటే పవన్ కు వల్లమాలిన అభిమానం, వాస్తవానికి వారి వల్లనే తాను ఈరోజున ఈ స్థాయిలో ఉన్నానని, అన్నయ్య వదినలు అమ్మ, నాన్నల తరువాత నన్ను ఇప్పటికీ కంటికి రెప్పలా చూసుకుంటారని పవన్ ఎప్పుడూ తన ఇంటర్వ్యూల్లో చెప్తూ ఉంటారు. నీమనసుకు నచ్చినదే చేయి, కాకపోతే దానివలన అవతలి వారికి ఎటువంటి సమస్యలు రాని విధంగా నడుచుకో అంటూ అన్నయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారని, ఆ మాటలు తనకు ఎల్లవేళలా గుర్తుకువస్తుంటాయని పవన్ అంటుంటారు. 

 

అన్న, వదినల వద్ద చిన్న వయసు నుండి ఒక బిడ్డగా పెరిగిన తనకు, వారికి ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోవాలో అర్ధం కాదని, ఆ భగవంతుడు వారికి పూర్ణ ఆయుషుని, అలానే వారి వివాహబంధంలో ఎప్పుడూ సుఖ, సంతోషాలనే ఇవ్వాలని తాను కోరుకుంటానని పవన్ చెప్తారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం చాలా తక్కువ మందిలో మాత్రమే ఉంటుందని, తనకు ఇంత మంచి జీవితాన్నిచ్చిన అన్న, వదినలను ఏమాత్రం మరిచిపోకుండా, ఎప్పుడూ వారి గురించి ఎంతో బాగా చెప్పడం, అలానే వారి పట్ల ఎంతో కృతజ్ఞతతో వ్యవహరించడం పవన్ కళ్యాణ్ లో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ అని ఆయన సన్నిహితులు, సినిమా ప్రముఖులు చెప్తూ ఉంటారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: