టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికి అర్ధమవుతుంది. ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే ప్రేక్షకుల్లో అదో ఆసక్తి ఉంటుంది. వార్త రావడం దాన్ని వైరల్ చేయడం అన్నీ కూడా క్షణాల్లో జరిగిపోతున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా గురించి టాలీవుడ్ ఎక్కువగానే ఆలోచన చేస్తుంది అనే విషయం కూడా అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాను ఎప్పుడు విడుదల చెయ్యాలి అనే దాని మీద ఇప్పుడు రాజమౌళి ఒక అంచనాకు రావడం లేదు అనేది టాలీవుడ్ జనాల మాట. 

 

అసలు ఎప్పుడు విడుదల చెయ్యాలి అనే దాని మీద హీరోలకు కూడా ఒక స్పష్టత లేదని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమాను షూట్ చేయడం ఇతర కార్యక్రమాలు చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి షూటింగ్ ని వాయిదా వేసే సూచనలే ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రతీ సీన్ కూడా చాలా జాగ్రత్తగా చెయ్యాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు షూటింగ్ కి వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి సినిమాను ఆరు నెలల పాటు వాయిదా వేసే ఆలోచనలో జక్కన్న ఉన్నట్టు సమాచారం ఇప్పట్లో షూటింగ్ కుదరదు అనే అంచనాకు వచ్చేశారు. 

 

అందుకే సినిమాను ఆలస్యం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది, మహా షూట్ చేస్తే ఇంకా రెండు నెలలు షూట్ చేస్తారు. ఈ ఏడాది చివరి వరకు కూడా షూటింగ్ జరిగే అవకాశం లేదు, మే లో విడుదల చేయడం కూడా సాధ్యం కాదు. కాబట్టి సినిమాను ఎక్కువ కాలం వాయిదా వేయడమే మంచిది అనే అంచనాకు వాళ్ళు వచ్చేసినట్టు సమాచారం. అది మినహా మరో మార్గం లేదని భావిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: