సినిమా హీరోల మద్య గొడవలన్నారు, హీరోయిన్ వెళ్లిపోయిందన్నారు,  అసలు షూటింగే జరగట్లేదన్నారు. సరే .. ఇవేం లేవురా బాబూ., అని టైటిల్ రివీల్ చేసిందో లేదో.. కరోనా వచ్చి కాటేసింది. ఇక సినిమా సంక్రాంతి కాదు సమ్మరే అని డిసైడై పోయారు జనాలు. ఇంతకీ ట్రిపుల్ ఆర్‌ రిలీజ్ మళ్లీ పోస్ట్ పోన్ అయ్యిందా..?
 
ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా వస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా మీద రోజుకో న్యూస్ బయటికొస్తోంది.  నెక్ట్స్ జనవరికి రిలీజ్ అని రాజమౌళి అనౌన్స్ చేస్తే.. అసలు సినిమా షూట్ అయిపోతేనే కదా.. ఆన్ టైమ్ రిలీజ్ అయ్యేది.. అంటూ డౌట్స్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వల్ల షూట్స్ బంద్ అవ్వడంతో సినిమా సంక్రాంతికి కాదు నెక్ట్స్ సమ్మర్  అని రూమర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
 
సంక్రాంతికి అసలు సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు చాలా మంది. ఎందుకంటే ఈ సినిమాలో ముగ్గురు హాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు. అసలు షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలీదు. అందులోనూ.. ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ చెయ్యడంతో మళ్లీ ఎప్పుడు వీటన్నింటికీ లాక్ డౌన్ తీస్తారో.. మళ్లీ ఫారెన్ నుంచి వచ్చి మిగిలిన కాల్‌షీట్స్ కంప్లీట్ చేస్తారో తెలీదు కాబట్టి సినిమా డౌటే అంటున్నారు.

 

లాక్ డౌన్ పీరియడ్ లో ‌ఖాళీ లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నాం. గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది అని చెప్తున్నారు  మేకర్స్. కానీ అసలు గ్రాఫిక్స్ వర్క్ ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా సింగిల్ సిస్టమ్ లో చెయ్యగలిగే పనికాదు . దానికి పెద్ద పెద్ద సర్వర్లు , టెక్నికల్ సపోర్ట్ కావల్సి ఉంటుంది.  రెట్రో సినిమా కాబట్టి.. సినిమాకి మేజర్ గా కావల్సింది గ్రాఫిక్స్. సో.. గ్రాఫిక్స్ కే ఎక్కువ టైమ్ పడుతుంది కాబట్టి.. లాక్ డౌన్ తీసేవరూ ఈ పని కూడా పోస్ట్ పోన్ అయినట్టే.

 

నిజానికి సినిమా 70 పర్సెంట్ అయ్యిందని చెబుతున్నారు . గ్రాఫిక్స్ , పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు మిగిలిన ప్యాచ్ వర్క్ తో కలిపి ఎట్టి పరిస్తితుల్లో అక్టోబర్, నవంబర్ కి ఫస్ట్ కాపీ చూడాలని టార్గెట్ పెట్టుకున్నారు రాజమౌళి అండ్ టీమ్. కానీ మళ్లీ లాక్ డౌన్ ఈ ఏప్రిల్ నెలాఖరు వరకూ ఎక్స్ టెండ్ అవ్వడంతో  ఇప్పుడప్పుడే షూటింగ్ లు స్టార్ట్ అయ్యే పరిస్తితి లేదుకాబట్టి.. ఆ టార్గెట్ ని రీచ్ అవ్వడం కష్టమే.

 

ఎందుకంటే ఫస్ట్ కాపీ చూశాక మళ్లీ జక్కన్న చెక్కుళ్లు స్టార్ట్ చేస్తాడు కాబట్టి.. రెండు నెలలు బఫర్ టైమ్ పెట్టుకున్నారు టీమ్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో  ఇవన్నీ జరగడం, సినిమా నెక్ట్స్ సంక్రాంతికి రిలీజ్ అవ్వడం అనేది సాధ్యం కాదంటున్నారు జనాలు . అందుకే సినిమా సంక్రాంతికి కాదు సమ్మర్ కే అని సోషల్ మీడియాలో రూమర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: