పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానులు చాలా ఎక్కువ. మెగాస్టార్ తర్వాత అంతమంది అభిమానులని సంపాదించుకున్నది పవన్ కళ్యాణే అని చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ చేసింది చాలా తక్కువ సినిమాలు ఇప్పటి వరకు ఇరవై ఐదు సినిమాలు చేశారు. ఇరవై నాలుగేళ్ల కెరీర్లో కేవలం ఇరవై ఐదు సినిమాలు మాత్రమే చేసినా ఎంతో మంది అభిమానులని సంపాదించుకోగలిగారు.

 

 

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు తెరకి పరిచయమయిన పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఏర్పడింది మాత్రం తొలిప్రేమ సినిమాతోనే. ౧౯౯౮ లో విడుదలయిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటి వరకు ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. కానీ వాటన్నికంటే కొత్తగా, విభిన్నంగా తెలుగు తెరకి అదే తొలిప్రేమ అన్నంత రేంజ్ లో విజయం సాధించింది.

 

 

సినిమా ద్వారానే పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఏర్పడ్డారు. సినిమాలో పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్ జనాలకి బాగా నచ్చింది. అమ్మాయి కోసం పడే తపన అప్పటి వరకు ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. అందుకే ప్రేమ గురించి ఎన్ని సినిమాలు వచ్చినా తొలిప్రేమ స్థానం ప్రత్యేకం. సాధారణంగా సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ సీన్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తారు. హీరోయిన్ గురించి అస్సలు పట్టించుకోరు.

 

 

కానీ మొదటిసారి హీరోయిన్ ని అంతబాగా ఇంట్రడ్యూస్ చేయొచ్చని ఈ సినిమా ద్వారానే అర్థమైంది. చీకటిలో ఉన్న హీరోకి చిచ్చుబుడ్డి వెలుతురులో అమ్మాయి రూపం కనిపించి తన జీవితంలోకి వెలుగుతీసుకొస్తుందనే ఫీలింగ్ ని ఇచ్చాడు కరుణాకరన్. అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. అభిమానులు ఏర్పడ్డారు. ఆ తర్వాత తమ్ముడు, ఖుషిలతో మరింతగా పెరిగిపోయారు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: