టాలీవుడ్ లో మన్మథుడు, కింగ్ అని అక్కినేని నాగార్జున ని మన్మథుడు, కింగ్ అని ఫ్యాన్స్ పిలుస్తుంటారు. ఇప్పటికీ యంగ్ హీరోలు అంతెందుకు తన కొడుకులతోనే పోటీగా నటిస్తున్నారు. ఆ మద్య కళ్యాన్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.   ఈ మూవీలో నాగార్జున ద్విపాత్రాభినయంలో నటించారు.  తండ్రీ కొడుకులుగా దుమ్మురేపాడు నాగార్జున.  తండ్రి పాత్ర బంగార్రాజు.. ఎంతో హుషారుగా సాగుతుంది.. తనయుడు డాక్టర్ అమాయకంగా ఉంటాడు. అయితే బంగార్రాజు పాత్రకు ఎంతో ప్రాధాన్యత రావడంతో అప్పట్లో ఈ మూవీ సీక్వెల్ ప్లాన్ చేశారు. కానీ అది సెట్ కాలేదు.

 

బంగార్రాజు పాత్ర పేరుతోనే ఈ మూవీ తెరకెక్కించాలని చూశారు. నాగార్జున కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన మూవీ.. ఈ మూవీ సీక్వెల్ బాగుంటుందని సీక్వెల్ సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ సినిమాలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్ర, ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దాంతో అదే పాత్ర పేరుతో.. అదే దర్శకుడితో సినిమా చేయడానికి నాగార్జున రంగంలోకి దిగారు. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లవలసిన ఈ ప్రాజెక్టు కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఈ సారి మాత్రం ఆలస్యం చేయకూడదని నాగార్జున బలంగా నిర్ణయించుకున్నారట.

 

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అన్ని షూటింగ్స్ బంద్ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మళ్లీ షూటింగ్స్ మొదలు పెడితే ఈసారి బంగార్రాజు సెట్స్ పైకి ఎక్కడం ఖాయం అంటున్నారు.  ఆగస్టులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టవలసిందేనని కల్యాణ్ కృష్ణతో నాగార్జున చెప్పినట్టుగా సమాచారం. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఆయన వున్నారు. కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ  ముఖ్యమైన పాత్రలో నాగచైతన్య నటించనున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: