కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ... సినీ కార్మికులు ఉపాధి లేక నిత్యావసర సరుకులు కొనుక్కోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి ఓ కరోనా క్రైసిస్ ఫండ్ కి లీడర్ గా బాధ్యతలను నిర్వహిస్తూ విరాళాలను సేకరించి సినీ కార్మికులకు కావలసిన నిత్యావసర సరుకులను ఎలా అందజేస్తున్నారో... బాలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా బడా హీరోలు రోజువారీ సినీ కార్మికుల కోసం విరాళాలు అందజేస్తూ మీకు మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు.


ఈ క్రమంలోనే ధూమ్ హీరో హృతిక్ రోషన్ రూ. 25 లక్షలు సినీ కార్మికుల సంక్షేమం కొరకు ఏర్పాటు చేసిన సినీ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్(CINTAA)కు విరాళంగా ఇచ్చారు. అయితే ఈ అసోసియేషన్ ద్వారా 4 వేల సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు అందుతున్నాయి. అనగా ఒక్కొక్క సినీ కార్మికుడికి 625 రూపాయలను హృతిక్ రోషన్ ఇచ్చాడని తెలుస్తోంది. అలాగే హృతిక్ బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కింద పనిచేసే ఉద్యోగులకు N95, FFP3 మాస్క్ లను ఉచితంగా పంపిణీ చేశాడు. ఈ విషయాన్ని హృతిక్్ రోషన్ సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ... ఇటువంటి విపత్కర సమయంలో సమాజాన్ని పరి రక్షిస్తున్న ఉద్యోగుల సేఫ్టీ కోసం మనమందరము ఏదో ఒక సహాయం చేయాలి. నా వంతుగా నేను మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు మాస్కులను పంపించాను', అని ఆయన పేర్కొన్నారు.


అలాగే ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా తిండి లేక బాధపడుతున్న పేద ప్రజలకు ఒక లక్షా ఇరవై వేల ఆహార పొట్లాలను సరఫరా చేసేందుకు హృతిక్ రోషన్ ఓ కీలకమైన పాత్ర వహిస్తున్నాడు. ఈ లాక్ డౌన్ సమయంలో ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్న వృద్ధులకు, పేదవారికి, రోజువారి కూలీలకు పోషకాహారం అందించే అక్షయపాత్ర అనే ఓ ఎన్జిఓ సంస్థకు హృతిక్ రోషన్ ఎంతో కొంత డబ్బు సహాయం చేస్తున్నాడు. హృతిక్ రోషన్ పలు సంస్థలకు విరాళాలు అందజేస్తూ... మన దేశంలో ఎవరూ కూడా ఆకలితో అలమటిస్తూ నిద్రపోకూడదు అని అన్నారు. అసలు ఏ సహాయం చేయని సెలబ్రిటీల కంటే సినీ కార్మికుల కోసం తన వంతుగా ఉడుత సాయం చేసిన హృతిక్ రోషన్ బెటర్ అని అందరూ ఆయన్ని తెగ పొగుడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: