ప్ర‌పంచ వ్యాప్తంగా అత‌లాకుత‌లం చేసిన భ‌యంక‌ర‌మైన వ్యాధి క‌రోనా వైర‌స్‌. ఈ వ్యాధి సోకిన వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అందులో ముందుగా జలుబు ఉంటుంది. ఆ తర్వాత జ్వరం, దగ్గు, తలనొప్పి, ఛాతిలో నొప్పి.. వీటితో పాటు ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. వీటన్నింటిని త్వరగా గుర్తించి చికిత్స చేయించుకోకపోతే అది న్యూమోనియాకు దారి తీసి.. శరీర అవయవాలపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి పరిస్థితి రాకముందే ప్రతీ ఒక్కరూ కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. దీని ద్వారా వ్యాధికి సంబంధించి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

 

ఇక ఈ సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల సంర‌క్ష‌ణ కొరుకు రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్ర‌లు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటూ రోడ్ల పైన ఎక్కువ‌గా జ‌నం తిర‌గ‌కుండా చాలా జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్నారు. ఈ వ్యాధి ఒక‌రి నుంచి మ‌రొక‌రికి అంటుకునే వ్యాధి కాబ‌ట్టి చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఇక ఇదిలా ఉంటే... ఈ వ్యాధి కార‌ణంగా ప్ర‌స్తుతం సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో చాలా మంది చిన్న చిన్న కార్మికులంద‌రూ ఆక‌లి కేక‌లతో ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఏమి చెయ్యాలో కూడా అర్ధం కాని ప‌రిస్థితుల్లో చాలా మంది హీరోలు సినిమాల్లో మాత్ర‌మే కాదు బ‌య‌ట కూడా హీరోల‌మే అనిపించుకుంటున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ క‌రోనా బాధితుల కోసం పెద్ద మొత్తంలో విరాళాన్ని అందించారు. 

 

ఆయ‌న సీఎం స‌హాయ‌నిధి అలాగే యూపి స‌హాయ‌నిధికి భారీ విరాళాన్ని అందించిన‌ట్లు స‌మాచారం. అయితే ఆయ‌న ఎంత ఇచ్చారు అన్న‌ది మాత్రం ఎక్క‌డా కూడా బ‌య‌ట‌కు ప్ర‌క‌టించ‌లేదు. దానికి సంబంధించి ఆయ‌న ఎక్క‌డా కూడా అఫీషియ‌ల్‌గా చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. ఇక ఇదిలా ఉంటే ఈ మ‌ధ్య‌కాలంలో ఆయ‌న న‌టించిన సినిమాల‌న్నీ కూడా వ‌రుస‌గా ఫ్లాప్ బాట ప‌ట్టిన‌ప్ప‌టికీ ఆయ‌న ఇంత పెద్ద మొత్తంలో విరాళాన్ని అందించ‌డాన్ని చాలా మంది నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: