కరోనా విపత్తు అందరి జీవితాలను తలకిందులు చేస్తోంది. చిన్నా - పెద్దా, అల్పాదాయ వర్గాలు – సంపన్నులు, కుల, మత, వర్గ, ప్రాంతీయ బేధాలతో సంబంధం లేకుండా అందరూ ఈ మహమ్మారి ప్రభావానికి కుదేలైపోతున్నారు. ప్రజల ఇంటి నుంచే ఈ యుద్ధం చేస్తున్నారు. ప్రజల కోసం డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు పోరాడుతున్నారు. ఏ కరోనా మహమ్మారి నుంచి అందరూ తమను తాము కాపాడుకోవటానికి ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయో.. అదే ప్రభుత్వాల ఆదేశాల మేరకు వీరు బయట తమ విధులు నిర్వర్తిస్తున్నారు.

 

 

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కూడా తనదైన పద్ధతిలో సాయం చేస్తున్నారు. హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్స్ , మాస్క్ లు పంపిణీ చేసి తన వంతు బాధ్యత నెరవేరుస్తున్నారు. విధుల్లో ఉన్న వీరికి ఇవి తోడుంటే వారికి రక్షణ కవచాలు ఉన్నట్టే. వీటి అవసరాన్ని, కార్మికుల కష్టాన్ని గుర్తించిన దిల్ రాజు వీరందరికీ స్వయంగా పంపిణీ చేసి మానవత్వాన్ని, సమాజంపై ఉన్న తన బాధ్యతను నెరవేర్చారు. కార్మికులు ఎక్కువ సంఖ్యలో వీటిని అందుకున్నారు. దిల్ రాజు చేస్తన్న ఈ పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మహమ్మారి నుంచి ప్రజలను, వ్యవస్థను కాపాడుతున్న కార్మికులు ఎంతైనా హర్షణీయులు.

 

 

దిల్ రాజు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ పంపిణీ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. దిల్ రాజు చేసిన సాయానికి కార్పొరేషన్ అధికారులు, కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. దిల్ రాజు తన వంతు బాధ్యతగా రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళంతో పాటు సినీ కార్మికుల కోసం చిరంజీవి ఏర్పాటు చేసిన సీసీసీకి కూడా విరాళం అందించి తన వంతు సాయం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: