శర్వానంద్ హీరోగా నటించిన ప్రస్థానం సినిమా లో సందీప్ కిషన్ చిన్నా అనే ఓ కీలకమైన పాత్రలో చాలా చక్కగా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు అయ్యాడు. ఐతే ఈ సినిమా విడుదలయి ఇప్పటికి 10 సంవత్సరాలు కావస్తోంది. అలాగే సందీప్ కిషన్ కూడా తన పది సంవత్సరాల సినీ కెరీర్ ని ఈరోజుతో విజయవంతంగా పూర్తి చేశాడు. అయితే ఏమైనా పది సంవత్సరాల తన సినీ ప్రస్థానం లో రొటీన్ లవ్ స్టోరీ, మంచు లక్ష్మి నటించిన గుండెల్లో గోదారి, జోరు, బీరువా, శమంతకమణి,  మనసుకు నచ్చింది లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. బాలీవుడ్ సినిమాల లో కూడా సందీప్ కిషన్ నటించిన తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని బాలీవుడ్ ప్రేక్షకులలో ఏర్పరుచుకున్నాడు.  'షోర్‌ ఇన్‌ ద సిటీ' అనే బాలీవుడ్ చిత్రంలో నటించి సందీప్ కిషన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయ్యాడు.



ప్రస్తుతం సందీప్ కిషన్ నరగసూరన్ అనే ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి అవగా... లాక్ డౌన్ కారణంగా విడుదల తేదీ వాయిదా పడింది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘నరకాసురుడు’గా చేస్తుండగా... అరవిందస్వామి శ్రియా శరన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. హిందీ తమిళ సినిమాలో నటించడంతో పాటు సందీప్ కిషన్ వెబ్ సిరీస్స్ లలో కూడా నటిస్తున్నాడు. నరగసూరన్ సినిమా తర్వాత అతను ఎక్స్ప్రెస్ అనే సినిమాలో నటించనున్నాడు.


ఏది ఏమైనా కుర్ర హీరో సందీప్ కిషన్ కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం తాను పది సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీలో విజయవంతంగా కొనసాగిన అందుకుగాను చాలామంది అభినందనలు తెలుపుతూ నెట్టింట పెద్ద దుమారమే రేపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: