టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా  పాత హీరోయిన్ లకు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. వాళ్ళతో సినిమా లు చేయడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మన తెలుగులో ఆసక్తి చూపిస్తున్న వారు... భూమిక స్నేహ, నదియా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అయితే కారణం ఏంటో తెలియదు గాని నదియా ను పక్కన పెట్టేసింది టాలీవుడ్. ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్ లను కూడా పక్కన పెట్టాలి అని భావిస్తున్నారు. మరి వాళ్ళు రేటు ఎక్కువగా డిమాండ్ చేయడమా... 

 

లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. భూమిక టాలీవుడ్ లో సత్తా చాటాలి సెకండ్ ఇన్నింగ్స్ లో అని భావించింది. కాని అనూహ్య కారణాలతో ఇప్పుడు ఆమెను కూడా పక్కన పెడుతున్నారని అంటున్నారు. ఆమె పారితోషికం ఎక్కువ డిమాండ్ చేయడమే కాదు చిన్న హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చెయ్యాలి అని భావించడం లేదట. నటనకు ఎంత ప్రాధాన్యత ఉన్నా సరే ఇప్పుడు ఆమె మాత్రం ఎక్కువగా దృష్టి పెట్టడం లేదని అంటున్నారు. అందుకే ఇక ఆమెను కూడా పక్కన పెట్టాలి అని చూస్తున్నారు. మన తెలుగులో ఆమె ఎక్కువగా సినిమాలు చెయ్యాలి అని చూసినా సరే ఆదిలోనే ఆమెను ఆపేశారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఆమెతో పాటు స్నేహ కూడా సినిమాలకు దూరం అయింది అంటున్నారు. స్నేహ తో సినిమా చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా ఆమెను పక్కన పెట్టారు అని అంటున్నారు. దీనికి స్పష్టమైన కారణం తెలియదు గాని స్నేహ కూడా భూమిక కారణమే చెప్పడం తో ఆమెను పక్కన పెట్టినట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఇక ఇతర సీనియర్ హీరోయిన్లను కూడా పక్కన పెట్టే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారని అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: