టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుంది అనేది అందరికి తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుంది అంటే చాలు జనాలు ఎంతో ఆశగా ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. క్రిష్ తో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎలాగూ వకీల్ సాబ్ సినిమాను దాదాపుగా పూర్తి చేసారు. ఆయన ఇప్పుడు కొత్తగా ఏ సినిమాను ఓకే చేస్తారు అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతున్న విషయంగా చెప్పుకోవచ్చు. 

 

పవన్ సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే దర్శకులు మాత్రం అతని తో సినిమాలను చేయడానికి వెనుకాడే పరిస్థితి ఉండదు అనేది అందరికి తెలుసు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఖాళీ గా ఉన్నారు. రాజకీయాల మీద ఆయన దృష్టి తగ్గించారు. రాబోయే రెండు మూడేళ్ళు ఎక్కువగా సినిమాలు చెయ్యాలి అని చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన కొడుకుని హీరోగా పరిచయం చెయ్యాలి అని భావిస్తున్నారు. కొడుకు ఇప్పటికే సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే రెండు మూడేళ్ళు కూడా కొడుకు సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. 

 

ప్రస్తుతం చిరంజీవి అకీర్ నందన్ తో సినిమా చెయ్యాలి అని చూస్తున్నారు. రామ్ చరణ్ కి ఈ బాధ్యతను ఆయన అప్పగించారు. ఇక యూత్ లవ్ స్టోరీ ని తీసుకుని రావాలి అని భావిస్తున్నారు. కథ కూడా రెడీ అయింది. అయితే ఆ సినిమా ముందుకి వెళ్తుందా లేదా అనేది ఎవరికి స్పష్టత అనేది రావడం లేదు. ప్రస్తుతం చిరంజీవి ఈ సినిమాకు నిర్మాతగా ఉన్నారు. దర్శకుడు ఎవరూ అనేది కూడా స్పష్టత రావడం లేదు. మరి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: