టాలీవుడ్ లో ఆర్కే రోజాకు ఒక క్రేజ్ ఉంటుంది. రాజకీయాలను పక్కన పెట్టి చూస్తే ఆమె చేస్తున్న వాటికి ఇక్కడ మంచి స్పందన ఉంటుంది. టాలీవుడ్ జనం ఆమె చేస్తున్న కార్యక్రమాలు సహా టీవీ షోస్ ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఆమె మాటలకు అభిమానులు ఉన్నారు. ఇక ఇది పక్కన పెడితే ఆమెకు ఇప్పుడు టాలీవుడ్ లో శత్రువులు తయారు అయ్యారు అనేది కొందరి మాట. ఆమె సినిమాలను చేయడానికి ముందుకి రాకపోవడానికి ప్రధాన కారణం అదే అనేది కొందరు చెప్తున్నారు. 

 

అసలు వాస్తవం ఏంటో తెలియకపోయినా మన జనాలు ఎక్కువగా కథలు అల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి... ఆమెకు మెగా ఫ్యామిలీ తో బాగా విభేదాలు వచ్చాయని సమాచారం. మెగా హీరో సినిమాలో ఆమెను ఎంపిక చేసినట్టే చేసి పక్కకు తప్పించారు అని సమాచారం. దీనిపై రోజా సీరియస్ గా ఉందని సమాచారం. ఆమెకు ఉన్న క్రేజ్ ని చూసి కొందరు బాగా ఇబ్బంది పడ్డారని జబర్దస్త్ కంటే నాగబాబు చేసే షో ఏ మాత్ర౦ ఆకట్టుకోవడం లేదని కొందరు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. 

 

ఆమెకు ఈ మధ్య కాలంలో క్రేజ్ బాగా పెరిగింది కాబట్టి మెగా బ్రదర్ నాగబాబు చేసే షో కి డిమాండ్ బాగా తగ్గింది టీవీ లో అని అంటున్నారు. రోజా కూడా గట్టి పోటీ ఆయన ఇస్తాడని భావించినా కొన్ని కార్యక్రమాలతో ఆ షో దాదాపుగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. జబర్దస్త్ స్పూఫ్ లా అది ఉంది అనేది కొందరి మాట. అందుకే ఇప్పుడు రోజా ను కొందరు సినిమాలు చేయనివ్వడం లేదని అందుకే ఆమె సినిమాలు దూరం అయింది అంటున్నారు. ఆమెకు అవకాశాలు వచ్చినా సరే కొందరు నిర్మాతలు వెనక్కు తగ్గారట.

మరింత సమాచారం తెలుసుకోండి: