దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 12,000 దాటింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా పంజా విసురుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కమెడియన్ బ్రహ్మానందం సోషల్ డిస్టన్స్ పాటించాలంటూ ఎప్పుడో చెప్పారని ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. 
 
నటుడు, డైలాగ్ రైటర్ హర్షవర్ధన్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో బ్రహ్మానందం క్యూ లైన్ లో నిలబడి వెనుక ఉన్న మనిషికి సామాజిక దూరం పాటించాలని సూచిస్తాడు. వెనుక నిలబడిన వాళ్లు అతని చేష్టలను చూసి నవ్వుకుంటారు. తరువాత మరోసారి వెనుక నిలబడిన వాళ్లు దూరంగా నిలబడాలని మరోసారి సూచిస్తాడు. సోషల్ మీడియాలో సామజిక దూరం పాటించాలని బ్రహ్మం ఎప్పుడో చెప్పారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

 
బ్రహ్మానందం అహ నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావుతో చెప్పిన డైలాగ్స్ కు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోట శ్రీనివాసరావు అరేయ్... అర గుండు వెధవా...! బయట జరుగుతున్న విషయాలు చెప్పరా అని అడిగితే బ్రహ్మానందం బయటకెవరూ రావట్లేదు మహాప్రభో...! మొన్నీ మధ్యే చైనా నుంచి క... క.... కరోనా అట.... మనుషుల్ని పది రోజుల్లో చంపేస్తుంది. మీరేం కంగారు పడకండి అయ్యా.... అ మహమ్మారి కరోనా మనుషులకు మాత్రమే సోకుతుందంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. 

 
మరో వీడియోలో ఇలియానా బ్రహ్మానందంతో బయటికెళతానన్నావ్ అని అనగా బ్రహ్మానందం కొడుతున్నారమ్మా అంటూ బదులు ఇసాడు. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితయ్యారు. ఎవరైనా లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వస్తే పోలీసులు వారిని లాఠీలతో చితకబాదుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో బ్రహ్మానందంకు సంబంధించిన కొన్ని వీడియోలు, స్పూఫులు తెగ వైరల్ అవుతూ ఉండటంతో బ్రహ్మం గారు లాక్ డౌన్ గురించి ఎప్పుడో చెప్పారంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: