టాలీవుడ్ హీరోలకు ఈ మధ్య కాలంలో వ్యాపారం ఎక్కువైంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. వాళ్ళు వ్యాపారం మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ప్రమోషన్ పెద్ద కష్టం కాకపోవడం తో ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా వ్యాపారాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అటు జాతీయ స్థాయిలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళ వ్యాపారం గురించి చర్చలు ఎక్కువగానే నడుస్తున్నాయి. హీరోల కు డబ్బు మీద ఆసక్తి పెరగడం తో వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా మార్కెటింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే అతను ఈ మధ్య కాలంలో వ్యాపారాల మీద దృష్టి పెట్టినట్టు సమాచారం. 

 

సినిమాల్లో అతనికి క్రేజ్ తగ్గింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అందుకే మహేష్ ఇప్పుడు ఎక్కువగా సినిమాలను కాదని నిర్మాణ రంగం మీద దృష్టి పెడుతున్నాడు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే మహారాష్ట్ర కూడా క్రమంగా కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. దీనితో మహేష్ బాబు నిర్మాణ రంగం మీద ఎక్కువగా ఫోకస్ చేసాడు అనేది టాలీవుడ్ జనాల మాట. కరోనా తగ్గిన తర్వాత తనకు సన్నిహితంగా ఉండే ఒక వ్యాపారి తో మహేష్ మాట్లాడి అప్పుడు అక్కడికి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. 

 

దాదాపు 200 కోట్ల వరకు అతను పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని సమాచారం. మహేష్ బాబు ఇప్పటికే తన భార్య నమ్రత, తండ్రి కృష్ణ తో దీని గురించి మాట్లాడినట్టు సమాచారం. వాళ్ళు కూడా మహేష్ అభిప్రాయాన్ని అసలు కాదు అనలేదని అంటున్నారు. మహేష్ బాబుకి ముందు నుంచి వ్యాపారాలు లేకపోయినా ఈ మధ్య కాలంలో ఎక్కువగానే కనపడుతున్నాయి. అందుకే మహేష్ బాబు ఇప్పుడు సినిమాలను తగ్గించి వ్యాపారం మీద ఫోకస్ చెయ్యాలి అని చూస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: