టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు నవదీప్.  కెరీర్ బిగినింగ్ లో హీరోగా నటించినప్పటికీ పెద్దగా కలిసి రాకపోవడంతో ఒకటీ రెండు సినిమాల్లో విలన్ గా కూడా నటించాడు.  శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘బాద్ షా’ మూవీలో ఎన్టీఆర్ కి విలన్ గా నటించాడు. ఈ మూవీ కూడా నవదీప్ కి పెద్దగా కలిసి రాలేదు.  దాంతో క్యారెక్టర్ పాత్రల్లో హీరో స్నేహితుడిగా నటిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కాంట్రవర్సీలకు కేంద్రంగా నిలుస్తుంటారు నవదీప్.  ఆ మద్య వచ్చిన బిగ్ బాస్ లో నవదీప్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి మంచి జోష్ నింపారు. చివరి వరకు బిగ్ బాస్ లో ఎంటర్ టైన్ చేశాడు నవదీప్.

 

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న నవదీప్ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో నవదీప్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో అతని ఫ్యాన్స్, సన్నిహితులు నవదీప్ కి ఫోన్, చాట్స్ లో టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. దాంతో ఈ విషయంపై స్పందించిన నవదీప్ ప్రస్తుతం తాను ఆర్ఆర్ఆర్ లో తాను నటించడం లేదని తేల్చి చెప్పాడు.

 

దీంతో ఈ పుకారుకు పుల్‌స్టాప్ పడింది. అయితే, మలయాళ  స్టార్ మోహన్ లాల్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఆయన కానీ, చిత్ర బృందం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆర్ఆర్ఆర్ లో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా, చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ప్రస్తుతం కరోనా వల్ల అన్ని సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: