టాలీవుడ్ దిగ్గజ నటుడు మంచు మోహన్ బాబు ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం అక్కడక్కడా కొంత సెలెక్టీవ్ గా మాత్రమే సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని కూడా కుదిపేస్తున్న కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో మిగతా దేశాల మాదిరిగా ఎక్కడి ప్రజలను అక్కడే ఇళ్లకు పరిమితం చేస్తూ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మే 3 వరకు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. దీనితో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవడంతో పాటు దేశంలోని అన్ని రంగాలు పూర్తిగా మూతపడ్డాయి. ఇళ్ల నుండి బయటకు రాలేక, చేయడానికి పని లేక ఎందరో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

 

మరికొందరు అయితే కనీసం పట్టెడు అన్నం కూడా దొరకని దీన స్థితిలో ఉండడంతో ప్రభుత్వాలు అటువంటి వారిని ఆదుకునేందుకు రేషన్, నగదు అందిస్తున్నాయి. అయినప్పటికీ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడం మా విధి అని కొందరు ప్రముఖులు తమ మంచి మనసుతో ముందుకు వచ్చి అందించడం జరుగుతోంది. ఇక ఇటువంటి సమస్యలు ఎదురైనపుడు ప్రజలను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే సినిమా పరిశ్రమ నుండి కూడా కొందరు ప్రముఖులు విరాళాలు అందిస్తుండగా, మంచు మోహన్ బాబు కూడా తన శక్తికొలది చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకుని, ఈ లాక్ డౌన్ ఎత్తేసేవరకు వారికి రెండు పూటలా ఉచిత భోజనం తో పాటు ప్రతి రోజూ ఎనిమిది టన్నుల కూరగాయలు కూడా ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చారు. 

 

కాగా మోహన్ బాబు తో పాటు ఆయన తనయులు విష్ణు, మనోజ్, తనయ లక్ష్మి మంచు కూడా ముందుకు వచ్చి ఈ బృహత్ కార్యంలో తమ వంతు సాయం అందిస్తుండడంతో పలువురు ప్రజలు, మంచు ఫ్యామిలీ పై నిజంగా మంచి మనసున్న ఫ్యామిలీ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకా ఎవరైనా మరికొంతమంది అవకాశం ఉన్న దాతలు ముందుకు వచ్చి తమకు వీలైనది కనుక సాయంగా అందిస్తే బాగుంటుందని, ఈ సమయంలో ప్రజలను ఆదుకోవడం మన బాధ్యత అని అంటున్నారు మోహన్ బాబు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: