టాలీవుడ్ సీనియర్ పీఆర్వో బిఏ. రాజు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ప్రతి క్షణం ఏదో ఒక విషయం ఇండస్ట్రీకి సంబంధించి, ఇండస్ట్రీ ప్రముఖులకు సంబంధించి అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇక సినీ ప్రముఖుల పాత ఫొటోలు, విషయాలు కూడా అప్డేట్ చేస్తూ ఉండడం.. ఈయన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాలు ప్రపంచానికి తెలియడం కామన్. తాజాగా ఆయన టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో ఫొటో ఒకటి అప్డేట్ చేశారు.
ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో కాదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు అయిన వరుణ్ తేజ్ తన తాత ఒళ్లో కూర్చొని ఉన్నారు. ఈ ఫొటోలో వరుణ్ లుక్స్ చాలా క్యూట్‌గా ఉన్నాయి. తాత వరుణ్ గెడ్డం నిమురుతూ ఉన్నారు. ఇక వరుణ్ ప్రస్తుతం ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ లాంటి హిట్లతో సూపర్ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
Mega Prince @IAmVarunTej shared his old memory with GrandFather in @instagram pic.twitter.com/0HG6Mnuq03
— BARaju (@baraju_SuperHit) April 16, 2020