అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ బాబు, తొలి సినిమాలో తన ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకుల నుండి మంచి పేరుతో పాటు విజయాన్ని కూడా దక్కించుకున్నారు. ఆ తరువాత ఆయన నటించిన గోకులంలో సీత, సుస్వాగతం, సినిమాలు కూడా మంచి సక్సెస్ లు అందుకోగా, ఆపై కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ హీరోగా వచ్చిన నాలుగవ సినిమా తొలిప్రేమ అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకుని యూత్ లో ఆయనకు విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అనంతరం వచ్చిన బద్రి సూపర్ హిట్ కొట్టగా, పవన్ ఏడవ సినిమాగా ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టి పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో తిరుగులేని పేరు తెచ్చిపెట్టింది. 

 

అయితే ఆ తరువాత నుండి పవన్ నటించిన సినిమాలు మధ్యలో పెద్దగా ఆడలేదు. సరిగ్గా అటువంటి సమయంలో తొలిసారిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా మంచి విజయాన్ని అందుకుని పవర్ స్టార్ బాక్సాఫీస్ స్టామినాని మరొక సారి అందరికీ రుచి చూపించింది. ఇక ఆపై కూడా పవన్ చేస్తున్న సినిమాలు ఆశించిన రేంజ్ విజయాన్ని అయితే అందుకోలేదు. మరోవైపు వరుసగా సినిమాలు వస్తూ, పోతూ ఉండేటప్పటికి అభిమానుల్లో కూడా తెలియని తీవ్ర నిరాశ ఉండేది. సరిగ్గా కొన్నేళ్ల తరువాత ఒక్కసారిగా అభిమానులు పవన్ నుండి ఏమి కోరుకుంటున్నారో, వారి ఆకలి తీర్చాలంటే ఎటువంటి సినిమా ఇవ్వాలో పూర్తిగా తెలుసుకుని, ఆయనను ఎంతో ఇష్టపడే దర్శకుడు హరీష్ శంకర్, పవన్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసి, దానితో అప్పట్లో అతి పెద్ద విజయాన్ని ఇచ్చి, మరొక్కసారి పవన్ దెబ్బకు బాక్సాఫీస్ కూడా షేక్ అయ్యేలా చేసారు. 

 

అనంతరం కొంత గ్యాప్ తరువాత రెండవసారి త్రివిక్రమ్, పవన్ ల కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా కూడా సంచలన విజయాన్ని అందుకుని పవన్ కెరీర్ కు అతి పెద్ద బాక్సాఫీస్ విజయాన్ని అందించింది. అయితే ఆ తరువాత నుండి మొన్నటి అజ్ఞాతవాసి వరకు పవన్ పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోయారు. కాగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న పింక్ రీమేక్ మూవీ వకీల్ సాబ్ తో మరొక్కసారి హిట్ కొట్టి, తనకు గ్యాప్ వచ్చినా బాక్సాఫీస్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని రుజువు చేసుకోవడం ఖాయం అని, ఆయన దెబ్బకు మరొక్కసారి బాక్సాఫీస్ కూడా భయపడాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ సినిమాతో పవన్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటారో చూడాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: