పవర్ స్టార పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ కు పూనకాలే అని చెప్పొచ్చు. తెలుగులో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ సినిమా అంటే బాక్సాఫీస్ కు పండుగే అని చెప్పొచ్చు. పవన్ సినిమా హిట్టా ఫ్లాపా అన్నది కాదు సినిమా చూశామా లేదా అన్నది పవర్ ఫ్యాన్స్ వరుస. పదేళ్లుగా ఒక్క హిట్టు లేకున్నా గబ్బర్ సింగ్ సినిమాతో దుమ్ముదులిపే రికార్డులు కొట్టడం పవర్ స్టార్ వల్లే అయ్యింది. యూత్ ఐకాన్ గా కెరియర్ మొదటి నుండి లవ్ స్టోరీస్, యాటిట్యూడ్ ఇలా యువత మెచ్చే అంశాలతో సినిమాలు చేస్తాడు పవన్ కళ్యాణ్. 

 

అంతేకాదు ఎవరైనా ట్రెండ్ ఫాలో అవ్వాలని చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ట్రెండ్ సెట్ చేస్తాడు. తెలుగు సినిమాల్లో పవన్ ట్రెండ్ సెట్టర్ అని చెప్పడానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. హీరో అంటే ఇలానే ఉండాలి అన్న పంథాకి బ్రేక్ వేసి యువతని మెచ్చే సినిమాలు.. హీరోయిజం చూపించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు పవర్ స్టార్. ఇక తెలుగు సినిమాల్లో పూర్తిగా హిందీ పాటని.. తెలుగు, ఇంగ్లిష్, హిందీ మిక్సింగ్ పాటలను ప్రేక్షకులకు అలవాటు చేసింది కూడా పవన్ కళ్యాణ్ అనే చెప్పొచ్చు. 

 

తమ్ముడు సినిమాలో లుక్ ఎట్ మై పేస్ ఇన్ ద మిర్రర్ సాంగ్ పూర్తిగా ఇంగ్లిష్ లో ఉంటుంది. అంతేకాదు బద్రి సినిమాలో మేరా దేశ్ హై ప్యారా ప్యారా సాంగ్ లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ మూడు భాషలు ఉండేలా చూసుకున్నాడు. ఖుషి సినిమాలో యే మేరా జహాన్ సాంగ్ పూర్తిగా హిందీలో ఉంటుంది. తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి టైం లో యూత్ ఆడియెన్స్ కు పవన్ అంటే పిచ్చి పట్టేలా చేశాడు. అందుకే అప్పటి యూత్ కే కాదు ఇప్పటి యువతకు పవర్ స్టార్ అంటే బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: