ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు 20 లక్షలకు చేరువయ్యాయి. ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1.26 లక్షలు దాటింది. చైనా నుంచి ప్రబలిపోయిన ఈ మాయదారి కరోనా వైరస్ రోజు రోజుకీ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. అడ్డుఅదుపు లేకుండా చెలరేగిపోతున్న ఈ వైరస్ బారినపడి దేశాలు అల్లాడిపోతున్నాయి.అమెరికాలో 6.14 లక్షల మందికిపైగా ఈ వైరస్‌కి చిక్కగా, 26 వేల మందికిపైగా మృతి చెందారు. కోవిడ్ కేసుల్లోనూ, మరణాల్లో అమెరికాదే అగ్రస్థానం. ఇక్కడ గత 24 గంటల్లోనే 24,895 కొత్త కేసులు నమోదయ్యాయి.  న్యూయార్క్ లో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒకదశలో ఇక్కడ మృతదేహాలు పబ్లిక్ పార్కుల్లో పూడ్చాల్సిన పరిస్తితి ఏర్పడింది. 

 

 ఇటీవల భారత్ లో తమకు అందుబాటులో వున్న 800 మందిని అమెరికా అధికార్లు ఒకరోజున సంప్రదించి విమానం రెడీగా వుంది వస్తారా? అని కోరితే, వారిలో 10 మంది మాత్రమే ముందుకొచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  తాజాగా అమెరికా లో మరణాలపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. అమెరికాలో సంభవిస్తున్న మరణాలు చూస్తుంటే అక్కడ ప్రతిరోజూ 9/11 దాడులు జరుగుతున్నట్టుగా ఉందని అభివర్ణించారు. కరోనా మహమ్మారితో పోల్చితే ఒసామా బిన్ లాడెన్ ఓ బచ్చా అంటూ వ్యాఖ్యానించారు.

 

అయినా, ఒసామా బిన్ లాడెన్ ఆత్మ పగబట్టి కరోనా వైరస్ రూపంలో అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటోందని భావించడంలేదని వర్మ ట్వీట్ చేశారు. ఇప్పటికే కరోనాపై రక రకాలుగా ట్విట్స్ చేసిన వర్మ పాట కూడా పాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువగా మరణాలు అమెరికాలో సంబవించడం నిజంగా ఇక్కడ భయోత్పాన్ని సృష్టిస్తుంది.  అయితే ఇక్కడ  మరణాలపై పలు రకాల కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.  మొదటి నుంచి విలాసవంతమైన జీవన విధానానికి అలవాటు పడ్డ అమెరికన్లు కరోనాని మాత్రం తట్టుకోలేక పోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: