ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కూడా ఎంతో కలవరపెడుతున్న ఒకే ఒక్క పేరు కరోనా వైరస్. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే పలు దేశాలు అన్ని కూడా ఎక్కడి ప్రజలను అక్కడే తమ తమ ఇళ్లకు పరిమితం చేస్తూ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలానే మన దేశాన్ని కూడా ఇప్పటికే ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించిన మన దేశం ప్రధాని నరేంద్ర మోడీ, దానిని మరొక మూడు వారాలు అనగా మే 3 వరకు పొడిగిస్తూ ఇటీవల మరొక ప్రకటన చేయడం జరిగింది. ప్రజల మధ్య సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఉంటేనే ఈ మహమ్మారిని త్వరితగతిన తరిమికొట్టవచ్చని భావించి పలు దేశాలు ఈ పద్దతిని అమలు చేస్తున్నాయి. 

 

దీనితో ఎక్కడి ప్రజలు అక్కడే ఇళ్లలో ఉండిపోవడంతో బయటకు రాలేక, చేయడానికి పనులు లేక, తినడానికి పట్టెడు అన్నం కూడా లేక అల్లల్లాడుతున్నవారు ఎందరో ఉన్నారు. కాగా అటువంటి వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత రేషన్ తో పాటు కొంత నగదును అందిస్తున్నప్పటికీ, మేము సైతం అటువంటి వారిని ఆదుకుంటాం అంటూ పలు రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు తమ మంచి మనసుతో ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పటికే మన తెలుగు సినిమా పరిశ్రమ నుండి కొందరు ప్రముఖులు ముందుకు వచ్చి తమశక్తి కొలది విరాళాలు అందించడం చేయగా, మరికొందరు తమకు వీలైనంతలో పేద వారికి ఉచిత సరుకులు, కూరగాయలు వంటివి అందిస్తున్నారు. 

 

ఇకపోతే టాలీవుడ్ కి అల్లరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈవీవీ సత్యనారాయణ చిన్న తనయుడు అల్లరి నరేష్, ఇటీవల తమ సంస్థల్లో పనిచేస్తున్న మొత్తం 60 మంది కార్మికులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున అందించి తన ఉదారతను చాటుకున్నారు. సినిమాల్లో అల్లరోడుగా నటించి మన అందరికీ గిలిగింతలు పెట్టే నరేష్, ఈ విధంగా గొప్ప పని చేసి మంచి మనసున్నోడుగా నిరూపించుకున్నాడు అంటూ పలువురు ఆయనపై అభినందనలు కురిపిస్తున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: