తెలుగులో సినిమాల్లో ఉత్తేజ్ కు నటుడిగానే కాకుండా రచయితగా కూడా మంచి గుర్తింపు ఉంది. పలు సమయాల్లో తనలోని కవిని వెలికి తీసి శెభాష్ అనిపించుకుంటూ ఉంటాడు. రీసెంట్ గా తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలకు, ఆయన ఇస్తున్న భరోసాకు ముగ్దుడయ్యాడు ఉత్తేజ్. దీంతో కేసీఆర్ ను ‘నాయినా’ అని పిలవాలనుంది అంటూ ఓ ఆడియోలో తన వాయిస్ వినిపించాడు.

 

‘నిన్ను నాయినా అని పిల‌వాల‌ని వుంది పిల‌వ‌నా.. మొన్న టీవీలో నిన్ను చూసినంక నీ మాట‌లు ఇన్నంకా నీ చెయ్యితోని మా కండ్ల నీళ్లు తుడిచినట్టు.. మా భుజాల మీద చేయి వేసి ధైర్యం చెప్పిన‌ట్టు.. మా ఇంట్లో మ‌నిషివైన‌ట్టు కొట్టింది. ‘నిన్ను నాయినా అని పిల‌వాల‌నుంది.. పిల‌వ‌నా నాయినా’. నిన్ను చూసినా నీ మాట‌లిన్నా బ్రతుకుమీద న‌మ్మకం వ‌స్తది.. భ‌యం అన్నది ఆమ‌డ దూరం పోతది. దేన్నైనా జ‌యిస్తాం అనిపిస్తది. మేం చేసుకున్న అదృష్టం ఇది. ఇది నా ఒక్కడి మాట కాదు, ఒక్క తెలంగాణ వాళ్ల మాట కాదు. మొత్తం తెలుగోళ్లందరి మాట‌. తెలంగాణ బిడ్డలే కాదు ఈ గడ్డమీద ఉన్న ఏ బిడ్డ కూడా ఉపాసం పండొద్దని అమ్మలెక్క అక్కున చేర్చుకున్నవ్. నాయిన లెక్క చూసుకున్నవ్‌’.

 

 

శ్రీ‌కృష్ణుడు గోవ‌ర్ధన ప‌ర్వత‌మెత్తి రాళ్ల వర్షం నుంచి గోవుల‌ను కాపాడినట్టు.. క‌రోనా బారిన ప‌డ‌కుండా నీ భుజం కాసినవ్. ఆపదలో ఆదుకున్నోడే దేవుడు. కనబడని పురుగు కరోనా అయితే.. నువ్వు మాకు క‌నిపించే దేవునివి. నువ్వు స‌ల్లగుండాలె నాయినా.. నీ కొడుకులు బిడ్డలు స‌ల్లగుండాలే’ అంటూ తన భావుకతను చాటుకున్నాడు. కరోనాను తరిమికొట్టేందుకు కేసీఆర్ తీసుకుంటున్న చర్యలకు ఉత్తేజ్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: