ప్రస్తుతం టాలీవుడ్ జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో కలిసి రౌద్రం రణం రుధిరం సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తి చేసుకుంది. రాబోయే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8 న ఆ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. వాస్తవానికి బాహుబలి రెండు సినిమాల అద్భుత సక్సెస్ తరువాత మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లో కూడా రాజమౌళి పేరు విపరీతంగా మారుమ్రోగుతోంది. ఒకరకంగా భారత దేశం గర్వించదగ్గ దిగ్గజ దర్శకుల్లో రాజమౌళి ఒకరుగా నిలుస్తారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

 

ఇక 2000వ సంవత్సరంలో బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన మిషన్ కాశ్మీర్ సినిమాకు ముందుగా ఎడిటర్ గా పని చేసిన ప్రఖ్యాత దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, ఆ తరువాత సంజయ్ దత్ హీరోగా తెరకెక్కిన మున్నాభాయ్ ఎమ్బిబిఎస్ సినిమాతో దర్శకుడిగా మారారు. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టిన రాజ్ కుమార్, ఆ తరువాత దానికి కొనసాగింపుగా వచ్చిన లగేరహో మున్నాభాయ్ సినిమాకు కూడా దర్శకత్వం వహించి మరొక సక్సెస్ అందుకున్నారు. ఆపై అమీర్ ఖాన్ తో ఆయన తీసిన 3 ఇడియట్స్, పీకే, అలానే ఇటీవల సంజయ్ దత్ బయోపిక్ గా రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన సంజు సినిమాలతో మరొక మూడు అద్భుత విజయాలు అందుకున్నారు రాజ్ కుమార్. వాస్తవానికి నిర్మాతగా, ఎడిటర్ గా, రచయితగా పని చేసిన రాజ్ కుమార్, దర్శకుడిగా చేసింది తక్కువ సినిమాలే అయినా, వాటితోనే భారత దేశం గర్వించదగ్గ దర్శకుడిగా గొప్ప పేరు దక్కించుకున్నారు. 

 

ఇక ఇటీవల రాజమౌళి మాట్లాడుతూ, రాజ్ కుమార్ గారు గతంలో ఒక ఇంటర్వ్యూ లో భాగంగా, తాను రాజమౌళి మాదిరిగా బాహుబలి లాంటి సినిమాని తన జీవితంలో తీయలేనని తనపై ప్రశంశలు కురిపించారని, అయితే వాస్తవానికి రాజ్ కుమార్ గారు మాదిరిగా ఆయన సినిమాల్లోని సీన్స్ లో ఏ ఒక్క సీన్ ని కూడా ఆయనంత గొప్పగా నేను తీయలేను అని రాజమౌళి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఈ ఇద్దరు ప్రఖ్యాత దర్శకులు కూడా ఎంతో ఖ్యాతిని గడించినప్పటికీ కూడా ఎంతో ఒదిగిపోయి వారి మధ్య కేవలం ఆరోగ్యమైన పోటీ, అలానే ఒకరి పట్ల మరొకరికి మంచి భావం కలిగి ఉండడం నిజంగా నెవ్వర్ బిఫోర్ - ఎవ్వర్ ఆఫ్టర్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: