రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల ఫెయిల్యూర్ తో కొద్దిగా వెనుకపడ్డ విజయ్ దేవరకొండ ఫైటర్ తో భారీ స్కెచ్ వేశాడు. అర్జున్ రెడ్డి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఫైటర్ తో బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు. 


ఇస్మార్ట్ హిట్ తో పూరి మళ్ళీ తన పాత ఫామ్ లోకి వచ్చినట్టే అంటున్నారు. అయితే పూరితో చేస్తిన్న ఫైటర్ సినిమా విజయ్ కు కచ్చితంగా హిట్ ఇస్తుందని చెప్పొచ్చు. అదెలా అంటే విజయ్ దేవరకొండ చేసిన గీతా గోవిందం సినిమా పరశురామ్ డైరక్షన్ లో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాను డైరక్టర్ పరశురామ్ ముందు అల్లు అర్జున్ కు వినిపించాడట. బన్ని చేయనని చెప్పేసరికి విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చింది. అర్జున్ రెడ్డి తర్వాత గీతా గోవిందం సినిమా పడటం విజయ్ కెరియర్ కు సూపర్ బూస్టింగ్ ఇచ్చింది. ఆ సినిమాతో విజయ్ ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరాడు. 


ఇక ఇప్పడు చేస్తున్న పూరి ఫైటర్ సినిమా కూడా పూరి జగన్నాథ్ అల్లు అర్జున్ కు వినిపించాడట. బన్నీకి కథ నచ్చినా ఎందుకో పూరికి ఎస్ అని చెప్పలేకపోయాడు. అయితే ఇదే కథతో పూరి తన కొడుకు ఆకాష్ పూరితో చేయాలని అనుకున్నాడు. కానీ కథలో కొన్ని మార్పులు చేసి ఫైనల్ గా విజయ్ దేవరకొండతో ఫిక్స్ చేసుకున్నాడు. బన్నీ కాదన్న కథతో గీతా గోవిందం హిట్ కొట్టిన విజయ్ ఫైటర్ తో కూడా సూపర్ హిట్ కొడతాడని అంటున్నారు. మరి ఈ సెంటిమెంట్ ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: