స్టార్ హీరోల హీరోయిజం మ‌ధ్య హీరోయిన్లు చ‌లాయించ‌డం అంటే మాట‌లు కాదు. అంద‌రూ సార్ సార్ అంటూ హీరోల వెంట ప‌డుతుంటే ఆ హీరోయిన్లు మాత్రం మ్యాడ‌మ్ మ్యాడ‌మ్ అంటూ హీరోలే వెంట‌ప‌డేలా చేసుకున్నారు. తొలినాటి నుంచి మొద‌లు పెడితే ఇలాంటి వారి సంఖ్య పెద్ద త‌క్కువేం కాదు. అల‌నాటి న‌టుల్లో మేటి న‌టి భానుమతి ఒక‌రు. భానుమ‌తి అప్ప‌ట్లో లేడీ సూప‌ర్‌స్టార్ ఎన్టీఆర్ త‌న‌దైన శైలిలో ఎన్ని క‌ళ‌ల‌ను ప్ర‌ద‌ర్శించారో భానుమ‌తి కూడా అంత‌క‌న్నా క‌ళ‌ల‌ను ప్ర‌ద‌ర్శించి శ‌భాష్ అనిపించుకున్నారు. భానుమ‌తి అంటే తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ఫ‌స్ట్ ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి.

 

ఆమె గొంతు, ఆహార్యం అందులోని గాంభీర్యం చూస్తే ఎవ‌రైనా స‌రే ఒణికిపోవాల్సిందే. అసలు భానుమ‌తి సెట్‌లోకి వ‌స్తే ఎంత పెద్ద న‌టులైనా స‌రే లేచి నుంచోవాల్సిందే. అంత‌గా మేల్ డామినేటింగ్‌లో ఫిమేల్ డామినేటింగ్ చూపించారు భానుమ‌తి. ఇదే కోవ‌లోకి వ‌చ్చే మ‌రో హీరోయిన్ జ‌మున స‌త్య‌భామ‌గానే మ‌ళ్ళీ తెలుగు సినిమా రంగం కోసం పుట్టిందా అన్న‌ట్టు ఉంటుంది జ‌మున వాలకం. తెర మీద తెర బ‌య‌ట ఒకేలా బిహేవ్ చేస్తూ త‌న‌తో క‌లిసిప‌నిచేసే పెద్ద పెద్ద హీరోల‌ను సైతం హ‌డ‌లెత్తించేసేది. అంత‌గా జ‌మున టెర్ర‌ర్ పుట్టించేవారు. హీరోల‌కు హీరోయిన్‌గా ఆమె ఎప్పుడూ కూడా ఫీల‌వ‌లేదు. త‌న‌కే వారు హీరోలుగా స్వ‌యం ప్ర‌క‌ట‌న‌లు గుప్పించేవారు. శోభ‌న్‌బాబు తొలినాళ్ళ‌ల్లో జ‌మున‌తో ఒకే ఒక్క చిత్రంలో న‌టించారు.

 

ఆ చిత్రం మంచి హిట్ అయిన త‌ర్వాత ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఆ త‌ర్వాత శోభ‌న్‌బాబే అన్న పేరొచ్చిన త‌ర్వాత మ‌ళ్ళీ జ‌మున‌తో సినిమాలో న‌టించ‌లేదు. కార‌ణం ఏమిటి అని అడిగితే అమ్మో జ‌మునగారితో సినిమానా అంటూ హ‌డ‌లి చెయ్య‌లేద‌ని తెలిసింది. అంటే అంత పెద్ద స‌ట్ఆర్ హీరోల‌ను వీరు కంట్ర‌ల్ చేసేవారు అన్న‌మాట‌. అంటే వీరి పెర్‌ఫార్మెన్స్‌కాని, వీరి ప‌ద్ధ‌తికాని అలానే ఉండేది. మాములుగా శోభ‌న్‌బాబు చాలా సిస్ట‌మ్యాటిక్‌గా సిన్సియ‌ర్‌గా ఉండేవారు. అలాగే ఆయ‌న టైమింగ్ అన్నీకూడా చాలా ప‌ర్‌ఫెక్ట్‌గా ఉండేవ‌ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: