ప్రపంచం మొత్తం కూడా కరోనా విలయతాండవంతో ప్రభుత్వాల వెన్నులో వణుకుపుడుతోంది. అయితే ఈ మహమ్మారిని వెంటనే అరికట్టకపోతే జరిగే నష్టం మరింత ఎక్కువ అవుతుందని భావించిన పలు దేశాలు, ఇప్పటికే తమ దేశ ప్రజలను పూర్తిగా ఇళ్లకు అంకితం చేస్తూ లాక్ డౌన్ ప్రకటించగా, మన దేశాన్ని కూడా మే 3 వరకు పూర్తిగా లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. ఎట్టిపరిస్థితుల్లో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఉన్న సమయంలోనే బయటకు రావాలని, అది కూడా ప్రతి ఇంటి నుండి ఒక్కరు మాత్రమే రావాలని పలువురు నాయకులు, అధికారులు కోరుతున్నారు. 

 

ఇక ఈ లాక్ డౌన్ వలన ఇప్పటికే అన్ని రంగాలు కూడా మూతపడడంతో పాటు ఎందరో ప్రజలు పని లేక, తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ కూడా ఎక్కడిక్కడ సినిమా షూటింగ్స్ ని నిలుపుదల చేసింది. దానితో ఎందరో సినీ కార్మికులు కూడా పనులు లేక తినడానికి తిండి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇటువంటి వారిని ఆదుకునేందుకు మన ప్రభుత్వాలు కొంత సాయాన్ని ప్రకటించినప్పటికీ, మేము కూడా ప్రజలను ఈ క్లిష్ట పరిస్థితిలో ఆదుకుంటాం అంటూ అనేకమంది పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమ దయా హృదయంతో ముందుకు వచ్చి విరివిగా విరాళాలు అందచేస్తున్నరు. 

 

కాగా సినిమా పరిశ్రమ నుండి ఇప్పటికే కొందరు ముందుకు రాగా, ఇటీవల తనకు రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా అతి త్వరలో తెరకెక్కనున్న చంద్రముఖి 2 లో ఛాన్స్ దొరికినందుకు గాను, నిర్మాత ఇచ్చిన డబ్బులు మొత్తం రూ.3 కోట్లను కరోనా విపత్తు బాధితులకు విరాళంగా ప్రకటించి తన గొప్ప మనసు చాటుకున్నారు లారెన్స్. ఇకపోతే నేడు మరొక రూ.15 లక్షల రూపాయలను చెన్నై లోని చెంగల్ పేట, తిరువళ్లూరు, కాంచీపురం సినిమా డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ కు ఇచ్చారు లారెన్స్. కాగా ఈ విధంగా రెండుసార్లు విరాళం ప్రకటించి తన ఉదారతను చాటుకున్న లారెన్స్ ని నువ్వు మాములోడివి కాదు, నిజంగా దేవుడివి అంటూ పలువురు అభిమానులు, ప్రజలు ఆయన పై పొగడ్తలు కురిపిస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: