మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకుల్లో చిరంజీవి బలమైన పునాది వేసుకున్న విషయం తెలిసిందే. ఆయన కుటుంబం నుంచి వచ్చిన వారు స్టార్లు, సూపర్ స్టార్లు అయ్యారు. పవన్ కల్యాణ్ నుంచి వైష్ణవ్ తేజ్ సినిమాల వరకూ మొదటి టికెట్టు కొనేది చిరంజీవి అభిమానే. అంతలా చిరంజీవి కుటుంబాన్ని అభిమానులు, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వీరిలో అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. కానీ.. ఇటివల అల్లు అర్జున్ వ్యవహరిస్తున్న తీరు చాలా విమర్శలకు తావిస్తోంది.

 

 

మెగాభిమానుల బలంతోనే తొలి సినిమా నుంచి ఎదిగాడు బన్నీ. సినిమాల్లోకి వచ్చి 17ఏళ్లయిన సందర్భంగా ఇటివల చేసిన ట్వీట్ లో మెగా ఫ్యాన్స్ గురించి గానీ చిరంజీవి పేరు గానీ ప్రస్తావించ లేదు. పైగా ఈ జనరేషన్ లో తనను అభిమానించే ఫ్యాన్స్ ను ఆర్మీ అంటూ ట్వీట్ చేశాడు. చిరంజీవి సోషల్ మీడియాలోకి వస్తే రెండో రోజుకు గానీ వెల్ కమ్ చెప్పలేదు. రీసెంట్ గా కరోనా గురించి ప్రజలకు ధైర్యాన్నిస్తూ మెగా, అల్లు ఫ్యామిలీ అంతా కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ తీసిన ఫొటోలో బన్నీ లేడు. చిరంజీవే ఆ పిక్ కు కర్త, కర్మ, క్రియ అయి ఉంటాడనేది నిజం.

 

 

తామంతా ఒకటే అని చిరంజీవే స్వయంగా చెప్తున్నా బన్నీ ఇలాంటి అవేర్ నెస్ ప్రోగ్రామ్ లో లేకపోవడం విచిత్రం. పోనీ.. షూటింగ్ బిజీనా అంటే కరోనా దెబ్బకి అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. మరి ఆ పిక్ లో బన్నీ ఎందుకు లేడో అర్ధం కాని ప్రశ్న. ఇలా మెగాభిమానుల్లో వ్యతిరేకత వచ్చేలా తనకు తానే టార్గెట్ అవుతున్నాడు. ఈ కట్టె కాలే వరకూ నేను చిరంజీవి గారి అభిమానినే అనే బన్నీ విమర్శలు కొని తెచ్చుకుంటున్నాడు. దీనిపై బన్నీ సమాధానం ఏంటో.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: