టాలీవుడ్ లో కొరటాల శివకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల తో సినిమా చేయడానికి గానూ ఎందరో హీరోలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పోటీ పడుతూ వస్తున్నారు. కొరటాల కమర్షియల్ సినిమాలను చాలా జాగ్రత్తగా తీస్తూ ఉంటారు. ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా ఇప్పటి వరకు హిట్ అవుతూనే ఉన్నాయి. అన్ని సినిమాలు కూడా అగ్ర హీరోలతో చేసినవే. దీనితో ఆయన క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఆయన సినిమా అంటే కచ్చితంగా హిట్ అవుతుంది అనే భావన అగ్ర నిర్మాతలకు కూడా ఉన్న నేపధ్యంలో ఆసక్తి చూపిస్తున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన చిరంజీవి తో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్న నేపధ్యంలో ఈ సినిమా కోసం ఆయన కాస్త ఎక్కువగా కష్ట పడుతున్నారు. ఆచార్య సినిమా తర్వాత కొరటాల చేసే సినిమా మీద ఎవరికి స్పష్టత లేదు. అయితే ఆచార్య తర్వాత కొరటాల చేసే సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. కొరటాల తో సినిమా చేయడానికి గాను పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. కథ రెడీ చేయమని కూడా కోరినట్టు సమాచారం. 

 

అయితే కొరటాల ఆ తర్వాత సినిమాను ఎన్టీఆర్ తో చేసే అవకాశం ఉన్న నేపధ్యంలో ఈ సినిమా గురించి అంతగా ఆసక్తి చూపించలేదు అనేది టాలీవుడ్ జనాల మాట. అందుకే ఈ సినిమా ఆగిపోయింది అంటున్నారు. అయితే పవన్ మాత్రం రాబోయే రెండేళ్ళ లో తన తో సినిమా చెయ్యాలని శివ ని అడిగినట్టు సమాచారం. ఆయన కూడా దీనిపై సానుకూలంగానే ఉన్నా ముందు ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్నారట ఇతర సినిమాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: