టాలీవుడ్ లో నానీ కి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. నానీ సినిమా అనగానే జనాలకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆ ఆసక్తి క్రమంగా తగ్గుతుంది అంటున్నారు. నానీ సినిమాల్లో అతని రెగ్యులర్ నటనే దీనికి కారణం అనేది జనాల మాట. నానీ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత అతను ఏ సినిమా చేస్తాడు అనేది తెలియదు. త్రివిక్రమ్ తో ఒక సినిమా చెయ్యాలి అనుకున్నా త్రివిక్రమ్ రెండు మూడేళ్ళ వరకు ఎవరికి దొరికే పరిస్థితిలో కనపడటం లేదని అర్ధమవుతుంది.. 

 

ఇక కొందరు దర్శకులు అయితే నానీ తో సినిమాలు చెయ్యాలి అనుకుని కూడా వెనక్కు తగ్గడం ఇప్పుడు అతన్ని బాగా ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. నానీ తో సినిమా చేయడానికి ఒకప్పుడు ఆసక్తి చూపించిన దర్శకులు కూడా అతని సినిమాల మీద ఆసక్తి చూపించడం లేదు. ఈ మధ్య కాలంలో నానీ హీరోగా వచ్చిన ఒక్క సినిమా కూడా సరైన విజయం సాధించిన పరిస్థితి లేదు అనేది అందరికి అర్ధమవుతుంది. ఏ విధంగా కథను ఎంచుకున్నా సరే ఆ సినిమా మాత్రం హిట్ అవ్వడం లేదు. 

 

ఇక ఇప్పుడు అతను సెంటిమెంట్ ని నమ్ముకుని ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. జెర్సీ సినిమా తర్వాత నానీ కి మంచి హిట్ అనేది రాలేదు. ఆ సినిమా తర్వాత అతను పెద్దగా సినిమాలను విడుదల చేయలేదు. గతంలో ఏడాదికి రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టే వాడు నానీ. ఇప్పుడు అలా లేదు. చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. మరి దీనికి కారణం ఏంటీ అనేది చూడాలి. నానీ సినిమాల కోసం నిర్మాతలు కూడా పెద్దగా ఆసక్తి చూపించే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: