రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా భారీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ తెరకెక్కుతుండగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్యలో ఒకానొక ఇంపార్టెన్స్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇందుకోసం రాజమౌళి నుండి అనుమతి కూడా తీసుకున్నాడు. సాధారణంగా తన సినిమాల్లో నటించే హీరోలకి సినిమా విడుదలయ్యే వరకు మరో చిత్రంలో నటించకూడాదని లాక్ చేసే రాజమౌళి చిరంజీవి కోసం ఒప్పుకున్నాడు.

 

 

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉందట. సాధారణ క్యామియో రోల్ కాకుండా, సినిమాలో అరగంటపాటు కనిపించే పాత్ర అని చెబుతున్నారు. అంతే కాదు రామ్ చరణ్ కి జోడీ కూడా ఉండనుందట. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటించే హీరోయిన్ కోసం వెతుకుతున్నారని సమాచారం. విప్లవ కారుడిగా రామ్ చరణ్ కనిపిస్తాడని వార్తలొస్తున్న నేపథ్యంలో , చరణ్ కి జోడీగా ఎవరైతే బాగుంటుందో సెర్చ్ చేస్తున్నారు.

 

 

ఆర్ ఆర్ ఆర్ లో బాలీవుడ్ భామతో జోడీ కడుతున్న రామ్ చరణ్ కి ఆచార్యలో బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నారు. అయితే ఆల్రెడీ మెగాస్టార్ పక్కన నటించడానికి కాజల్ చాలా ఎక్కువ పారితోషికం తీసుకుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో హీరోయిన్ కోసం ఎక్కువ మొత్తంలో పారితోషికం కేటాయించలేని కారణంగా టాలీవుడ్ హీరోయిన్ నే నటింపజేయాలని చూస్తున్నారు.

 


మరి ఏ టాలీవుడ్ హీరోయిన్ కి ఆ అదృష్టం దక్కనుందో చూడాలి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కమెడియన్ వెన్నెల కిషోర్ ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. కోవిడ్ ౧౯ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: