మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఆచార్య'... మెగాస్టార్ కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. 'సైరా నరసింహారెడ్డి' సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్య లీకైన చిరు లుక్ ఈ చిత్రంపై అంచనాలను పెంచేలా చేసింది. ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా చెప్పకపోయినా ఇదే కంఫర్మ్ అని తెలుస్తోంది.

 

ఈ మధ్య 'ఆచార్య' స్టోరీ లైన్ ఇదే నంటూ మెగాస్టార్ చిరంజీవి కొంచెం హింట్ కూడా ఇచ్చారు. సామాజిక బాధ్యత కలిగిన ఓ వ్యక్తి సహజ సంపదను కాపాడడం కోసం ప్రభుత్వంపై ఎలా పోరాటం సాగించాడు అన్నదే ఈ కథ అని తెలుస్తోంది. సోషల్ మరియు పొలిటికల్ థ్రిల్లర్ గా ఆచార్య ఉంటుందని చిరు చెప్పడం జరిగింది. కొరటాల శివ గత చిత్రం 'భరత్ అనే నేను' కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. కమర్షియల్ అంశాలుగా జోడించి కొరటాల కాంటెంపరరీ పొలిటికల్ ఇష్యూస్ ని టచ్ చేస్తూ ఆచార్య తీసే అవకాశం ఉంది.

 

ఇదిలా ఉండగా ఈ చిత్రం తరువాత మెగాస్టార్ మరో పొలిటికల్ థ్రిల్లర్ చేయనున్నాడు. మలయాళ హిట్ మూవీ 'లూసిఫర్' తెలుగు రీమేక్ రైట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ దక్కించుకుంది. ఇక ఈ మూవీ తెలుగు స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో సాహో దర్శకుడు సుజీత్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చిరు నుండి బ్యాక్ టు బ్యాక్ పొలిటికల్ థ్రిల్లర్స్ రానున్నాయి. మెగాస్టార్ తన కెరీర్ లో పొలిటికల్ థ్రిల్లర్స్ చేసింది చాలా తక్కువ. అలాంటిది ఆచార్య, లూసిఫర్ తెలుగు రీమేక్ రెండు పొలిటికల్ థ్రిల్లర్స్ కావడం విశేషం. ఈ మధ్య పాలిటిక్స్ కి దూరంగా ఉంటూ వస్తున్న మెగాస్టార్ ఈ సినిమాలతో మళ్ళీ పాలిటిక్స్ లో రీఎంట్రీ ఇస్తున్నాడన్న మాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: