క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టే ప‌నిలో ఇటు సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు అదే ప‌నిలో ఉన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ కూడా ఎంతో బాధ్య‌త‌తో ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. సినీ ఇండ‌స్ట్రీ మొత్తం ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయింది. సినిమా షూటింగ్‌ల‌న్నీ కూడా ఎక్క‌డివ‌క్క‌డ ఆగిపోయాయి.  ఇక ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల్ల అంద‌రూ ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఎప్పుడూ షూటింగ్‌ల‌తో, ఓపెన్సింగ్స్‌, రిలీజ్‌లు, స‌క్సెస్‌మీట్‌ల‌తో ఫుల్ బిజీగా గ‌డిపే హీరోలు సైతం ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఎప్పుడూ స్పెండ్ చెయ్య‌లేనంత టైమ్ ప్ర‌స్తుతం హీరోలంద‌రూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో టైమ్‌ని స్పెండ్ చేస్తున్నారు. 

 

అంతేకాక వారు ఎవ‌రెవ‌రు ఏ విధంగా టైమ్‌ని స్పెండ్ చేస్తున్నారో వారి అభిమానుల‌తో త‌మ త‌మ సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు. సెలబ్రిటీలు తమ రోజువారీ పనుల తాలుకూ విషయాలను, వర్కౌట్స్, ఇళ్లు క్లీన్ చేయడం, కుక్ చేయడం వంటి పలు సంగతులను వీడియో రూపంలో ప్రేక్షకులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని తన కొడుకు జున్నుల మధ్య కరోనా గురించి ఒక చిన్న‌ ఆసక్తికరమైన చర్చ జరిగింది. కరోనా మహమ్మారి పిల్లలను ఎంతలా భయపెడుతుందో, దాని వ‌ల్ల జ‌రిగే న‌ష్టాల గురించి నాని త‌న కొడుకుకి వివ‌రంగా చెబుతున్నారు. అలా దాని పట్ల పిల్లలకు ఎంత అవగాహన ఉంది అన్న‌ది నాని కొడుకు అయిన జున్ను మాటలు వింటే అర్థమవుతోంది. తన కొడుకుతో కరోనా గురించి మాట్లాడుతున్న వీడియోను నాని త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రేక్షకులతో పంచుకున్నాడు.

 

నాని: జున్ను బయట ఎవరున్నారు?
జున్ను: కరోనా వైరస్..
నాని: ఇప్పుడు మనమేంచేయాలి?
జున్ను: ఇంట్లోనే ఉండాలి..
నాని: అప్పుడేం జరుగుతుంది?
జున్ను: కరోనా వైరస్.. గో..
నాని: గుడ్.. వెరీ గుడ్..
నాని అడిగిన ప్రశ్నలకు జున్ను ముద్దు ముద్దుగా జవాబులిచ్చిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: