ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మన భారతదేశంలో కూడా అడుగు పెట్టేసరికి కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణమే కఠినమైన లాక్ డౌన్ దేశవ్యాప్తంగా ప్రకటించడంతో... పేదవారు, సినీ కార్మికులు రోజువారీ కూలీలు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా ఎందరో తమ పనులు కోల్పోయి ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. తన పరిస్థితి కూడా పేదవారి లాగానే దయనీయంగా మారిందని అంటుంది తెలుగు కథానాయకి పాయల్ ఘోష్. 2009వ సంవత్సరంలో వచ్చిన ప్రయాణం సినిమా లో హీరో మంచు మనోజ్ సరసన నటించిన పాయల్ ఘోష్... ఊసరవెల్లి తో సహా మరికొన్ని తెలుగు సినిమాలలో నటించింది.


ఐతే, లాక్ డౌన్ కారణంగా ఆమె ఎన్ని బాధలు పడుతుందో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేసింది. తన పోస్టులో... 'ఉపాధి లేదు. జీవితం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. ప్రయాణం చేసే సౌకర్యం కూడా బయట లేదు. ఆర్థికంగా నేను చాలా చితికిపోతున్న. ఇటువంటి గడ్డు పరిస్థితులు నా జీవితంలో మళ్లీ పునరావృతం కాకూడదని ఆశిస్తున్నాను. ప్రస్తుతం మన జీవితం పూలపాన్పు ఏమీ కాదు. పరిస్థితులు సానుకూలంగా లేనప్పుడు ఏ జీవితాన్ని అయినా సంతోషంగా అంగీకరించాల్సిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన లాక్ డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి సమాజాన్ని పరిరక్షించాలి. మనం జాగ్రత్తగా ఉండడంతో పాటు మన తోటి కాంటాక్ట్ అయ్యే వారిని కూడా జాగ్రత్తగా ఉంచడం మన ముఖ్యమైన బాధ్యత' అని ఆమె పేర్కొంది.


మరొక పోస్టులో... ' నిర్లక్ష్యం, అలసత్వం చూపిస్తూ మనం బయట తిరిగితే కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా కోట్లల్లో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ రెండు వారాల పాటు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. మనందరం కలిసి కరోనా మహమ్మారి పై పోరాటం చేద్దాం', అని ఆమె పేర్కొంది. పాయల్ ఘోష్ 2008లో 'షార్పీస్‌ పెరిల్‌’ అనే ఓ ఇంగ్లీష్ మూవీ ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టి... కాలక్రమేణా తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలలో హీరోయిన్ గానే కాకుండా అనేకమైన కీలక పాత్రలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: