దేశమంతా లాక్ డౌన్ జారుగుతున్నవేళ ప్రజలు ,ఫిల్మ్ స్టార్స్ లాక్ డౌన్ కు మద్దతుగా నిలుస్తున్నారు .కానీ దేశం లో కొంత మంది ప్రజలవల్ల లాక్ డౌన్ చాలా కష్టంగా మారుతుందని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మండిపడుతున్నాడు. COVID-19 దేశంలో వేగంతో వ్యాపించడంతో ప్రభుత్వం జారీ చేసిన లాక్డౌన్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై సల్మాన్ ఖాన్ విరుచుకుపడ్డారు. వారిని జోకర్లు గా అభివర్ణిస్తున్నాడు మన 54 ఏళ్ళ కండల వీరుడు.

 

మొదట మోడీగారు ప్రకటించినప్పుడు అది కేవలం రెండురోజుల సెలవులు అనుకున్నాను కానీ అది మా సెలవుగా మారాయి. సాధారణ జ్వరమేకదా వైరస్ తొలగి పోతుంది అని అంత అనుకున్నాం కానీ కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో పెరిగిపోతోంది. లాక్ డౌన్ కారణంగా నేను మా తల్లిగారు మరియు నా ఇద్దరు చెల్లెల్లు మరియు వారి పిల్లలు అంతకుడా ఇంట్లోనే  ఉంటున్నాం. పనికి వచ్చిన వారుకూడా మాకు చాలా సన్నిహితులయ్యారని తెలిపాడు. అదేవిధంగా బయటివారు లోపలి ,లోపలివారు బయటకు వెళ్లవద్దని తాను ఆర్డర్ వేసినట్లు మైనే ప్యార్ కీయ యాక్టర్ చెబుతున్నాడు .

 

నిత్యావసరాల కోసం కేవలం ఇంటినుండి ఒకేఒక్కరు మాత్రమే వెళతారని అదికూడా మాకు నమ్మకస్తులైన ఖాతాదారులవద్దకు మాత్రమే వెళతారని చెప్పుకొచ్చారు బాలీవుడ్ హీరో. కరోనా ఒకవ్యక్తి నుండి మరో వ్యక్తికీ ఎలాసంక్రమిస్తుందో చెప్పలేము అంతమాత్రాన వారిని చిన్న చూపుచూడకూడదు. వ్యాధిని ఓ అంటురోగంగా మార్చవద్దని ప్రజలను కోరాడు. త్వరలోనే ఈ మహమ్మారి భారత దేశాన్ని వదిలి వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సల్మాన్ ఖాన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: