కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సినిమా ప్రముఖులు తమ వంతుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుండి తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ సోకకుండా పాటించవలసిన తగు జాగ్రత్తలు వీడియోల రూపంలో తెలియజేస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా సామాజిక మాధ్యమాలలో రంగ ప్రవేశం చేసే కరోనా వైరస్ కారణంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు విరాళాలు సేకరించడం ప్రారంభించాడు.


అలాగే తాను కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఓ వీడియో రూపంలో తెలిపారు. చేతులు సబ్బుతో కడుక్కోవాలి, బయటకు వెళ్లకూడదు, మాస్కు ధరించాలి అంటూ ఆయన చెప్పిన వీడియో ప్రస్తుతం అన్ని టీవీలలో ప్రసారం కావడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో కలసి కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు.


అయితే తాజాగా మళ్లీ మెగాస్టార్ ఫ్యామిలీ అంతా కలిసి కరోనా పై యుద్ధం చేద్దామంటూ ఓ విన్నూత సందేశాన్ని ఇచ్చారు. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మెగా ఫ్యామిలీ లోని వారందరూ కార్డులపై ఒక్కొక్క పదాన్ని చూపించారు. ఆ పదాలను కలిపితే... 'ఇంట్లో ఉందాం యుద్ధం చేస్తాం. క్రిమిని కాదు ప్రేమను పంచుతాం. కాలు కదపకుండా కరోనా ని తరిమేస్తాం. భారతీయులం ఒక్కటై భారత్ ని గెలిపిస్తాం', అనే సందేశం వచ్చింది.


కాగా, ఈ సందేశాన్ని ప్రజలకు తెలపడంలో మెగా ఫ్యామిలీ లోని రామ్ చరణ్, చిరంజీవి, నాగబాబు, ఉపాసన, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక, అల్లు శిరీష్ ఇంకా తదితరులు పాల్గొనగా... అల్లు అర్జున్ గానీ పవన్ కళ్యాణ్ గానీ ఎక్కడా కనిపించలేదు. దాంతో అభిమానులు బన్నీ, పవన్ కూడా ఈ ఫోటోలో ఉన్నట్లయితే చాలా బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన పడుతూ 'అన్నా, మీరు ఎందుకు ఈ సందేశం లో పాల్గొనలేదు', అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: