సినిమాలలో అయన ఒక పవర్.. అతను ఉన్నాడు అంటే ఎలాంటి సినిమా అయినా సరే కనీస కలెక్షన్లు వసులు అవుతాయి.. నిజానికి ఆయన ఒక మాములు హీరోనే.. కానీ అతనికి ఓ రేంజ్ హిట్స్ వచ్చాయి. అతను ఒకో సినిమాలో ఒకో రకమైన యాక్టింగ్.. ప్రత్యేకంగా అతనికంటూ ఒక స్టైల్.. అదే అతన్ని అభిమానులకు దగ్గర చేసింది.. 

 

కెరీర్ మొదట్లో వరుసగా ఏడు సినిమాలు ఎవరికైన హిట్ కొట్టాడు.. ఇంకా ఆ హిట్స్ తో అతనికి అభిమానుల లెక్కపెట్టలేనంతమంది అయ్యారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే హిట్ అన్నట్టు హిట్ కొట్టారు. అయన సినిమాలు వరుసగా హిట్ కావడానికి ఆయనకు అంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఉంది.. కామెడీ చేస్తాడు.. ఏమోషన్ కి గురి చేసి ఏడిపిస్తాడు.. 

 

ఇంకా అయన ప్రేమ సినిమాలు కోసం అయితే కాలేజీ యువత అంత ఓ రేంజ్ లో ఎదురు చూసేది.. అయన తీసిన ప్రతి సినిమాలో ప్రేమ కథ ఉంటుంది.. కొన్ని సినిమాల్లో ప్రేమ కథే ప్రత్యేకం అయితే.. మరి కొన్ని సినిమాల్లో ఎమోషనల్ కథతో పాటు ప్రేమ ఉంటుంది.. తమ్ముడు సినిమాలో అన్న సెంటిమెంట్ ఏ రేంజ్ లో పండిందో ఇంకా ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరం లేదు. 

 

అంతేకాదు ఇంకా తొలిప్రేమ సినిమా ఎంత అద్భుతమో పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంత ప్రత్యేకమో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ తరువాత వచ్చిన ఖుషి, గుడుంబా శంకర్ సినిమాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ఇంకో విషయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ సినిమాలో కథ బాగున్నా బాగాలేకపోయిన.. పాటలు మాత్రం అద్భుతంగా ఉంటాయి.. అందుకే పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఎక్కువ.. ఆ అభిమానులకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి.           

మరింత సమాచారం తెలుసుకోండి: