పవర్ స్టార్ అన్న పేరు వినిపించగానే ఆయన అభిమానుల గుండెల్లోకి సర్రున రక్తం పాకుతుంది. ఒక్కసారిగా ఒళ్ళంతా విద్యుత్ ప్రవహించునట్టు అవుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ కి అంతమంది అభిమానించడానికి సినిమాలొక్కటే కారణం కాదు. సినిమాలే కారణమయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్లాక చల్లబడేవారు. కానీ ఇప్పటికీ ఆయనపై అభిమానం చూపిస్తున్నారంటే సినిమా కంటే గొప్పగా ఆయన దగ్గర ఏదో ఉంది.

 

 

పవన్ కళ్యాణ్ ఎందరికో సినిమా అవకాశాలని ఇచ్చాడు. కొత్తగా దర్శకత్వం వైపు మళ్లలనుకునేవారి కథల్ని పట్టించుకోని రోజుల్లో కొత్త దర్శకులకి అవకాశం ఇచ్చాడు. అలా అవకాశం అందించుకుని తెలుగులో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వాళ్ళలో పూరి జగన్నాథ్ ఒకరు. బద్రి సినిమాతో పూరి జగన్నాథ్ తెలుగు సినిమా పరిశ్రమకి దర్శకుడిగా పరిచయమయ్యాడు. అయితే ఆ సినిమా కథ చెప్పడానికి పూరి జగన్నాథ్ వచ్చినపుడు ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.

 

ఉదయం నాలుగు గంటలకి పవన్ కళ్యాణ్ కథ వింటాడని తెలిసి పూరి ఆశ్చర్యపోయాడట. పొద్దున్నే నాలుగింటికి లేచి పవన్ కళ్యాణ్ ఇచ్చిన అరగంట టైమ్ ని ఇంకాస్త పెంచుతూ పెంచుతూ ౮ గంటల వరకి కథ వినిపించాడట పూరి. కథ మొత్తం నచ్చిన తర్వాత క్లైమాక్స్ మార్చాలని పవన్ కళ్యాణ్ అడిగాడట. వారం తర్వాత మళ్లీ అదే క్లైమాక్స్ ని వినిపించిన పూరి పవన్ కళ్యాణ్ చేత ఓకే అనిపించుకోగలిగాడు.

 

తన కోసం కథ మార్చుతాడేమోనని టెస్ట్ చేసాడట పవన్ కళ్యాణ్ .అయితే సాధారణంగా ఒక హీరోతో సినిమా చేసేముందు ఆ హీరో సినిమాలని చూస్తుంటారు. కానీ పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ సినిమాలని చూడకుండానే ఓకే అనిపించుకున్నాడు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ తో చెబితే, చూడకుండా నాతో ఎందుకు సినిమా చేయాలనుకున్నావు అని అడిగాడట. దానికి మీరు ఫామ్ లో ఉన్నారు. అదీగాక కొత్తవాళ్లకి అవకాశం ఇస్తారని వచ్చానని అన్నాడట.

 

సాధారణంగా హీరో సినిమాలు చూడకపోతే ఫీల్ అవుతారు. కానీ పవన్ కళ్యాణ్ అలాంటి వాటిని పట్టించుకునే రకం కాదు. అందుకే అతనికి అభిమాన గణం అంత పెద్దగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: